Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చిలుకూరు
పాడి రైతులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఆనంద్ పాల సంఘం వార్షికోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాడి రైతులకు పెద్దపీట వేస్తున్నారన్నారు. ఎంతో మంది రైతులు పాల ఉత్పత్తి పై జీవనం కొనసాగిస్తున్నారన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పాల సంఘాలకు ప్రభుత్వం నుండి అన్ని వసతులు అందేలా కషి చేస్తానన్నారు .అనంతరం పాల సంఘం కమిటీ వారు ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు ఆనంద పాల సంఘం అధ్యక్షులుగా అలస కాని అప్పారావు ఉపాధ్యక్షులుగా దొంతగాని నరసింహారావు మొగల్ చాందు కమిటీ సభ్యులుగా మరీదు రామకష్ణ, కోడారు రాము మంకెన వెంకయ్య ,మా దాస్ భారతమ్మ ,బెల్లంకొండ ఉపేందర్ ,బండి శ్రీనివాసరావు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు .ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బెల్లంకొండ రమణ, నాగయ్య, ఆనంద పాల సంఘం మాజీ చైర్మన్ మంకెన రామారావు ,కస్తూరి నరసయ్య ,మరీదు సైదులు పాల్గొన్నారు.