Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్ గొంగిడి సునీత
నవతెలంగాణ - రాజాపేట
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు సంఘం నారాయణరెడి జీవితం నేటి సమాజానికి ఆదర్శనీయమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఆదివారం మండలంలోని బొందుగుల గ్రామంలో నారాయణరెడ్డి విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం సాగిన పోరాటంలో సంఘం నారాయణ రెడ్డి పాత్ర క్రియాశీలకమైన తెలిపారు .నారాయణ రెడ్డి ఆయన పోరాట ఫలితంగా ఈ ప్రాంతంలో పేద ప్రజలకు భూమిని పంచడం జరిగిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నా జీవితాన్ని ఆదర్శం తీసుకొని ముందు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు ,ఆలేరు మాజీ ఎమ్మెల్యే కొడుదుల నగేష్ ,నాయకులు ఉజ్జిని రత్నాకర్, కుటుంబ సభ్యులు బొందుగుల వెంకటేశ్వర్ రెడ్డి , గిరి రెడ్డి రామ ముకుందరెడ్డి ,ఎంపీపీ గోపా గాని బలమని ,స్థానిక సర్పంచ్ కంచర్ల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నాయకులు కొల్లూరి రాజయ్య, మండల కార్యదర్శి చిగుళ్ల లింగం, మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, ప్రజానాట్యమండలి నాయకులు చెక్క వెంకటేష్ ,సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.