Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బాల భాస్కర్ రావు
నవతెలంగాణ -భువనగిరిరూరల్
యదాద్రి జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ ను యదాద్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి , మండల న్యాయ సేవా సమితి అధ్యక్షులు వి. బాల భాస్కర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు తమ కేసులను రాజీపూర్వకముగా పరిష్కరించుకొని స్నేహ పూర్వక వాతావరణంలో జీవనం సాగించాలని, వివాదాలు పెంచుకొని సమయము వథా చేసుకోరాదని తెలుపుతూ, ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా అన్ని రాజీకి ఆమోద యోగ్యమైన క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు మొత్తంగా 9972 పరిష్కరించినట్టు తెలిపారు. భువనగిరి పరిధిలో 4500 క్రిమినల్ కేసులు, 2 సివిల్ కేసులు . బ్యాంక్ లావాదేవీల కేసులు 2 పరిష్కరించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కె. మారుతీదేవి, ప్రథాన సీనియర్ సివిల్ జడ్జి రజని, ప్రథాన జూనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర రావు, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కవిత, స్పెషల్ మేజిస్ట్రేట్ జావిద్, యాదాద్రి జిల్లా డి.సి.పి నారాయణ రెడ్డి, ఎ.సి. పి. వెంకట్ రెడ్డి, భువనగిరి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కేశవ రెడ్డి, కార్యదర్శి రాంరెడ్డి, లోక్ అదాలత్ సభ్యులు, న్యాయవాదులు, పోలీసు యంత్రాంగం, కక్షిదారులు పాల్గొన్నారు.
రాజీ మార్గాన్ని పెంచుకోవాలి
న్యాయమూర్తులు అర్జున్, కలిదిండి తులసి దుర్గా రాణి
రామన్నపేట: రాజీ మార్గమే రాజా మార్గం అయినందున రాజీ మార్గాన్ని ఎప్పుడు విడువ రాదని జూనియర్ సివిల్ జడ్జి అర్జున్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కలిదిండి తులసి దుర్గా రాణి తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో భాగంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్థానిక జూనియర్ సివిల్ కోర్టు అడిషనల్ జూనియర్ సివిల్ కోర్టుల్లో లోక అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. రాజ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవడం సమాజంలో స్నేహ సంబంధాలు పెరుగుతాయన్నారు. 160 కేసులను రాజ మార్గం ద్వారా పరిష్కరించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు జినుకల ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి నకిరేకంటి మొగులయ్య, ఎ జీ పి ఉయ్యాల హనుమంతు గౌడ్, సీఐ మోతీ రామ్, ఎస్ ఐ లక్ష్మయ్య, సహాయ కార్యదర్శి బర్ల డేవిడ్, ఎం ఎ మజీద్, యాదసు యాదయ్య నోముల స్వామి సభ్యులు దినేష్ కుమార్, న్యాయవాదులు శ్రవణ్, దంతూరి సత్తయ్య, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
లోక్ అదాలత్ ద్వారానే సమన్యాయం : జడ్జి సంకేత మిత్ర
హుజూర్నగర్ : లోక్ అదాలత్ ద్వారానే ఇరుపక్షాలకు సమయం లభిస్తుందని జూనియర్ జడ్జి సంకేత మిత్ర అన్నారు. ఆదివారం స్థానిక కోర్టులో నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమంలో ప్రసంగించారు. రెగ్యులర్ కోర్టులో కేసులు ఏదో ఒక పక్షం మాత్రమే గెలుస్తుంది అన్నారు లోక్అదాలత్ పరస్పర అంగీకారంతో రాజీ పడటం వల్ల సమయం డబ్బు ఆదా అవుతుందన్నారు. అంతేకాకుండా సత్వర న్యాయం పొందుతారన్నారు. కోర్టులకు చెల్లించిన ఫీజులు కూడా తిరిగి పొందవచ్చన్నారు. ఈ లోక్అదాలత్ లో కేసులు పరిష్కారం అయ్యాక పై కోర్టుకు అప్పీల్ చేసుకునే అవకాశం లేదన్నారు. 1300 క్రిమినల్ కేసులు సివిల్ కేసులు పరిష్కరించినట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యులు కాల్వ శ్రీనివాసరావు కోర్టు సురేష్ రాఘవరావు పి శ్రీనివాసరావు సీఐ రామలింగారెడ్డి ఎస్ ఐ కట్టవెంకట్ రెడ్డి న్యాయ స్థానం పరిధిలోని ఏడు పోలీస్ స్టేషన్లో ఎస్సై లు న్యాయవాదులు రమణారెడ్డి మీసాల అంజయ్య జక్కుల వీరయ్య సైదులు వెంకట్ రెడ్డి జుట్టు కొండ సత్యనారాయణ లతీఫ్ శ్రీకాంత్ రెడ్డి శ్యామ్ కుమార్ సైదులు తదితరులు పాల్గొన్నారు.