Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- పెద్దవూర
గత చరిత్ర ఆనవాళ్లు ఎక్కడ దొరికినా,వెలుగు చూసినా మనం ఎంతో ఆసక్తిగావాటిని చూస్తూ ఉంటాం, వాటి ద్వారా చరిత్రను తెలుసుకోవాలను కుంటాం .అలాంటిఅనవాళ్లు దొరికే ప్రదేశాలకు కూడా వెళ్లాలని అనుకుం టాం. నల్గొండ జిల్లా పెద్దవూరమండలం వెనుక వెయ్యేళ్ల చరిత్ర ఉందని,చాళుక్యుల కాలంనాటి శిల్ఫాలను ,గుర్తించి నట్లు పురావస్తు పరిశోధకుడు , ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ ,డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. ఆదివారం పెద్దవూర గ్రామస్తుల ఆహ్వానం,మేరకు ఆదివారం స్థానిక, ఆంజనేయ స్వామి ఆలయం వద్దగల చారిత్రక,శిల్ఫాలను పరిశీలించారు.ఇక్కడ 8,9,16 వ,శతాబ్దాల కాలం లో చాళుఖ్యులు, రాష్ట్రకూటులు,విజస్య నగర రాజులకాలంనాటి,శాసనాలు,ఆనవాళ్లు, ఉన్నాయన్నారు. గతంలో బట్టుగూడెం గ్రామంలో ని దేవాలయాలలో పలుచోట్లపరిశీలించామని, గ్రామంలో కొత్త రాతియుగం,ఇనుపరాతియుగం శాతవాహనుల కాలంనాటి అవశేషాలుఉన్నట్లు ,తెలుసుకున్నారు. అలాగే గ్రామంలో ఉన్న ఇష్ట కామేశ్వరస్వామి ఆలయ ఆలయ సమీపంలోచోలులు,రాష్ట్ర కూటూలు, క్రీ.పు 2500క్రీ.శ.1055-75 మధ్య కాలంలో పశ్చిమ చాళుక్య రాజు అయిన త్రైలోక్య మల్లన్న దేవారాయ కాలంలో ఏర్పాటైన అనవాలుఉన్నట్లు తెలుసు కున్నారు.