Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నకిరేకల్
వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ కందాల ప్రమీల మాట్లాడుతూ రైతుల వ్యవసాయ అవసరాలకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వ్యవసాయానికి కేవలం ఆరు గంటల కరెంటును సరఫరా చేయడం సమంజసం కాదన్నారు. ఆరు గంటల విద్యుత్ సరఫరా తో బ్రేక్ డౌన్ వల్ల మోటార్లు, స్టార్టర్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం ఏ డీ ఈ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు యానాల కష్ణారెడ్డి, ప్రతినిధులు మర్రి వెంకటయ్య, వంటే పాక వెంకటేశ్వర్లు, కోట లింగయ్య, సి హెచ్. లుర్డు మారయ్య, వెంకట రంగారెడ్డి, లక్ష్మీ నర్సు, వంటే పాక కష్ణ, లక్ష్మి, లక్ష్మణరావు పాల్గొన్నారు.