Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా జిల్లా ప్రధానకార్యదర్శి పాలడుగు ప్రభావతి
నవతెలంగాణ-మిర్యాలగూడ
జులై 4న హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ఐద్వా ఆధ్వర్యంలో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి పాలడుగు ప్రభావతి కోరారు.సోమవారం పట్టణంలో మనులా అరుణ అధ్యక్షతన నిర్వహించిన ఆ సంఘం మండల కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు.జిల్లాలోని మహిళలు అనేక సమస్యలను ఎదుర్కుంటున్నారన్నారు.కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 30 సార్లు గ్యాస్ ధరలను పెంచిందన్నారు.రేషన్ షాపుల ద్వారా 14 రకాల సరుకులను ఇవ్వాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం నేటికీ ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.అభయహస్తం పేరుతో ఉన్న డబ్బులను ఇంతవరకు అకౌంట్లో జమ చేయలేదన్నారు.పావలావడ్డీ రుణాలు లేవన్నారు.బ్యాంకు లోన్లు ఇవ్వడం లేదన్నారు.డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చిన దాఖలాల్లేవన్నారు.ప్రభుత్వం సంక్షేమ పథకాల సంగతే మరిచిపోయిందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు వరలక్ష్మి, మాజీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు గాదె పద్మ, టౌన్ కమిటీ సభ్యురాలు రజిని, కృష్ణవేణి, సరిత, లక్ష్మీ పాల్గొన్నారు.