Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మఠంపల్లి
మండలంలోని మట్టపల్లివద్ద దళిత,గిరిణులు ఎంతోకాలంగా నివాసముంటున్న ఇండ్లను సోమవారం ఉదయం పోలీసు పహారాలో జేసీబీలతో కూల్చివేశారు. సంఘటనా స్థలాన్ని సీపీఐ(ఎం), వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మట్టిపల్లి సైదులు, భూక్యా పాండు నాయక్,మాలోతు బాలునాయక్ పరిశీలించి మాట్లాడారు.పేదల ఇండ్లు కూల్చడం దుర్మార్గమైన చర్యఅని ఆగ్రహం వ్యక్తంచేశారు. మట్టపల్లిలోని ఒకటో సర్వేనెంబర్లో చాలాఏండ్లుగా నివాసగహాలు ఏర్పాటుచేసుకొని జీవిస్తున్న నిరుపేదలను ఖాళీ చేయించేందుకు అ ధికారపార్టీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలను కలెక్టర్, ఇతర అధికారులకు విన్నవించినా పరిష్కారం కాలేదన్నారు. చివరికి పోలీసులను అడు ్డపెట్టుకొని తొలగించడం హేయమైన చర్య అన్నారు. ఇండ్ల విషయంలో అనేక ఏండ్లుగా పోరాటంచేస్తూనే ఉన్నారన్నారు.వెంటనే ఉన్నతాధి కారులు స్పందించి పేదలకు న్యాయం చేయాలని కోరారు.తిరిగి పేదలకు ఇండ్లు దక్కేవరకు అండగా ఉంటామన్నారు.ఈ కార్యక్రమంలో వినోద్,వాలీబారు, వెంకటేశ్వర్లు, సైదులు,శంభయ్య హర్యానాయక్ పాల్గొన్నారు.