Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్టౌన్
దళితులందరికి దళితబంధు ఇచ్చేవరకు రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటాలు ఉధృతం చేయాలని కెేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటగోపి పిలుపునిచ్చారు. హుజుర్నగర్టౌన్, మండలంలోని దళితులందరికి దళిత బంధు ఇవ్వాలని కోరుతూ సోమవారం కేవీపీఎస్ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ దళితులందరికి దళిత బంధు ఇస్తామని చెప్పి ప్రకటించిన ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలకు, మంత్రు లకు లేకుండా చేయాలని డిమాండ్ చేశారు.రాజకీయ నాయకులకు, పైరవీకారులకు కాకుండా అర్హులకు ముందుగా అందించా లన్నారు.యూనిట్ల మంజూరులో అవినీతి, అక్రమాలు లేకుండా లబ్దిదారుల ఎంపిక జరగాలని, అక్రమాలకు పాల్పడే అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రతి దళిత కుటుంబానికి 100 యూనిట్ల ఉచిత కరెంట్ హామీని ఎందుకు అమలుచేయడం లేదని ప్రశ్నించారు. దళితులకు పెన్షన్లు రాక, ఇండ్లు లేక, ఇండ్ల స్థలాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే పట్టించుకునేవారే లేరన్నారు.దళిత బంధు కోసం దళితులు ఇచ్చిన దరఖాస్తులపై విచారణ జరిపి గ్రామసభలో లబ్ధిదారుల పేర్లు ప్రకటించాలని కోరారు. గ్రామాల్లో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిస్కారం చేయాల న్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు నాగారపు పాండు, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు మర్రి నాగేశ్వరరావు,కౌన్సిలర్ త్రివేణి,అధ్యక్ష, కార్యదర్శులు సిద్దెల వెంకటయ్య,మీసాల వీరబాబు, జిల్లా నాయకులు తుమ్మకొమ్మ యోనా, ప్రజా సంఘాల జిల్లా నాయకులు పల్లె వెంకటరెడ్డి, దుగ్గి బ్రహ్మం, పోసనబోయిన హుస్సేన్,రేపాకుల మురళి, జక్కుల వెంకటేశ్వర్లు, రేపాకుల వీరస్వామి, గొబ్బి అబ్రహం నర్సింగ్ లింగమ్మ, పాశం వెంకటనారాయణ, తురక వీరయ్య,గణపవరపు శ్రీను,అరవింద్, వెంకటేశ్వర్లు, మరియమ్మ,శేషమ్మ, రాధమ్మ, రమేష్,ఇర్మీయా,నాగలక్ష్మి, మునేయ్య, దేవమ్మ, ఆదెమ్మ, కొండలు, స్వర్ణలత, కవిత, రేణుక, అన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.