Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి జగదీశ్‌రెడ్డి రైస్‌మిల్లర్లతో భేటి
నవతెలంగాణ-సూర్యాపేట
ధాన్యం కొనుగోలకు ఎఫ్‌సీఐలు ముందుకు రావాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కోరారు.అందుకు కేంద్రం చొరవ చూపాలని,యాసంగిలో కొనుగోలు చేసిన దాన్యంతో గోదాములు నిండి పోయాయని ఎఫ్‌సీఐ ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ఉదయం సూర్యాపేటలోని తన క్యాంపు కార్యాలయంలో సూర్యాపేట,నల్లగొండ, భువనగిరి యాదాద్రి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి భేటి అయ్యారు.అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు మంత్రికి వినతిపత్రం అందజేశారు.ఈ భేటీలో తుంగతుర్తి శాసనసభ్యులు గాదరికిశోర్ కుమార్‌తో కలిసి మాట్లాడారు. కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత చర్యలతో తెలంగాణాకు ఇక్కట్లు ఎదురువుతున్నాయన్నారు.అందులో మొదటిది వ్యవసాయ చట్టం అయితే రెండోది విద్యుత్ సంస్కరణలని చెప్పుకొచ్చారు.ఆ రెండు చట్టాలు కూడా ఆదాని కోసమేనని స్పష్టం చేశారు.అదే గనుక జరిగితే ఓనర్లు గుమస్తాలు కావడం ఖాయమన్నారు.ధాన్యం కొనుగోలు అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చిట్టిపోలు యాదగిరి,జనరల్ సెక్రెటరీ రేపాల భద్రాద్రి రాములు,గౌరవఅధ్యక్షులు కందుకూరి మహేందర్, నల్లగొండ సెంటర్ అధ్యక్షులు కర్నాటి నారాయణ, నకేరికల్ సెంటర్ అధ్యక్షులు కన్మంతరెడ్డికేశవరెడ్డి, మిర్యాలగూడ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్,సూర్యాపేట రైస్‌మిల్లర్స్ అధ్యక్షులు బొనలా రవీందర్,భువనగిరి జిల్లా రైస్ మిల్లర్స్ జనరల్ సెక్రెటరీ నాగభూషణంతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా రైస్‌మిల్లర్స్ 150 మంది పాల్గొన్నారు.