Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్రమ రవాణాపై నిఘా పెంచాలి
- జిల్లాలో కుక్కల బెడదను నివారించాలి
- కలెక్టర్ వినరుకృష్ణారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలో పశువుల అక్రమరవాణాపై గట్టి నిఘా ఉంచాలని కలెక్టర్ టి.వినరుకృష్ణా రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్లో జిల్లా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జంతువధ సంరక్షణ కమిటీ సమావేశంలో ఎస్పీ రాజేంద్రప్రసాద్‌తో కలిసి మాట్లాడారు.జిల్లాలో పశువులను ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ రవాణా చేసే వారికి మూడేండ్ల జైలుశిక్ష లేదా రూ.25 వేల జరిమానా అలాగే రెండింటిని అమలు చేసే అవకాశం ఉందన్నారు. ఆదిశగా పోలీస్, రెవెన్యూ, పశు సంవర్ధక శాఖ అధికారులు ప్రత్యేకదష్టి సారించాలన్నారు.పశువులవధ నిషేధంలో ఉందన్నారు. వైద్యాధికారుల ధ్రువీకరణ పత్రం తప్పక వుండాలని సూచించారు. జిల్లాలో పశువుల అక్రమ రవాణా జరుగుతుంటే పోలీస్ టోల్ ఫ్రీ నెం 100 ని సంప్రదించాలన్నారు. అక్రమ రవాణా ద్వారా పట్టుకున్న పశువులను జిల్లాలోనే ఉన్న గోశాలలకు తరలించి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.సంతలలో పశువుల రవాణా చేసేటప్పుడు విధిగా సంబంధిత పది వైద్యాధికారులతో ధ్రువీకరణ పత్రం అందుబాటులో ఉంచాలని, లేనిచో చర్యలు తప్పవని హెచ్చరించారు.జిల్లాలో అన్ని చెక్ పోస్టులలో గట్టి నిఘా ఉంచి ఎక్కువగా కేసులు నమోదు చేయాలని పోలీస్, సంబంధిత అధికారులను ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో పశువుల సంరక్షణ కోసం ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేశారని అలాగే 14 ఏండ్ల పశువులను వధించేందుకు ప్రభుత్వ అనుమతులు వున్నాయని తెలిపారు.అలాగే జిల్లాలో అన్ని జి.పి.ల తో పాటు మున్సిపాలిటీల్లో కుక్కల బెడద నివారించుటకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో రూ.20 లక్షలతో ఒక కేంద్రాన్ని నిర్మించడం జరిగిందని త్వరలో ప్రారంభం అనంతరం కుక్కల జనన నియంత్రణ కట్టడి చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు.అదేవిదంగా కోదాడ, హుజూర్ గర్ నియోజక వర్గాలలో కూడా ఈ కేంద్రాల నిర్మాణాల పనులకు టెండర్లు పిలవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.అలాగే జిల్లాలో ఉన్న అన్ని గ్రామ పంచాయతిలలో కూడా కుక్కల బెడద ఇప్పటికే గుర్తించామని వాటికి కూడా సూర్యాపేట కేంద్రానికి తరలించి జనన నియంత్రణ కట్టడిచర్యలు చేపడ్తా మన్నారు.అటవీ జంతువులు గ్రామాలలో సంతరిస్తే సత్వరమే కట్టడి చేసి అడవులలో వదిలేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్ర మంలో జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి శ్రీనివాస్‌రావు, సీఈఓ సురేష్, డీపీఓ యాదయ్య, డీఎఫ్ఓ ముకుందరెడ్డి, డీఎస్పీ నాగభూషణం, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.