Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లా నలు మూలాల నుండి వివిధ సమస్యలపై వచ్చి ప్రజావాణిలో ప్రజలు అందచేసిన దరఖాస్తులను సత్వరమే జిల్లా అధికారులు పరిష్కరించాలని కలెక్టర్ టి.వినరుకష్ణారెడ్డి ఆదేశించారు.సోమవారం ప్రజావాణిలో ఆర్డీఓ రాజేంద్రకుమార్తో కలిసి ప్రజలు వివిధ సమస్యలపై అందచేసిన దరఖాస్తులను స్వీకరించారు.ఈ సంధర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ భూసమస్యలకు సంబందించిన వివరాలను మీ సేవా ద్వారా సరిగా నమోదు చేసుకోవాలని తెలుపుతూ అలాగే వచ్చిన ప్రతి అర్జీదారులకు భూసమస్యలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.జిల్లాలో వానాకాలం సీజన్ మొదలైనందున రైతులకు ప్రత్యామ్నాయ పంటసాగు విధానం అలాగే నకిలీ విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి మోసపోకుండా రైతులకు వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండి అవగాహన కల్పించాలని సూచించారు.వివిధ మండలాల్లో ఉన్న భూసమస్యల దరఖాస్తులను తెప్పించి క్షుణ్నంగా పరిశీలించి అర్జీదారుల సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.ప్రజావాణిలో ఎక్కువగా భూ సమస్యలకు సంభందించిన దరఖాస్తులు అందాయని , ప్రజావాణిలో భూ సమస్యలకు సంబంధించి 33, ఇతరశాఖలకు సంబంధించి 7 దరఖాస్తులు మొత్తం 40 అందాయని అట్టి దరఖాస్తులను సత్వరమే పరిశీలించి అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.జిల్లాలో తరుచుగా వర్షాలు పడుచున్నందున జ్వరాలు, ఇతర అంటూ వ్యాదుకు ప్రభలకుండా వైద్యాధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలు చేపట్టాలని అలాగే అన్ని వైద్య శాలలో మందులను సరిపడా ఉంచాలని సూచించారు.ప్రజావాణికి హాజరుకానీ అధికారులపై చర్యలు తప్పవని ఈ సందర్బంగా హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఓ శ్రీదేవి, పర్యవేక్షకులు పులి సైదులు, జిల్లాఅధికారులు,అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు.