Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
- తహసీల్దార్ కార్యాలయం ముట్టడి
నవతెలంగాణ -రామన్నపేట
ప్రజా సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని సీపీిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు విమర్శించారు.. అర్హులైన పేదలకు పింఛన్, రేషన్ కార్డు, దళితబంధు, ఇంటి నిర్మాణానికి రుణ సాయం అందించాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు కేసీిఆర్ ఇచ్చిన హామీలు నీటి మీద రాతలాగే మిగిలిపోయాయి తప్ప అమలుకు నోచుకోలేదన్నారు. 75ఏండ్ల స్వాతంత్య్ర భారతంలో రేషన్ కార్డు కోసం ఏండ్ల తరబడి వేచీ చూడాల్సిన దుస్థితి ఎర్పడిందన్నారు. పింఛన్లు రాక నాలుగేండ్ల నుండి వద్దులు, వితంతులు, వికలాంగులు, ఒంటరి మహిళలు ఎదురు చూస్తుంటే రేపు మాపు అంటూ రాష్ట్ర పాలకులు కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. భర్త చనిపోతే వెంటనే పింఛన్ తీసి వేస్తారు కానీ భార్యకు ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నించారు. ఐదు ఎకరాల భూమి ఉంటే పింఛన్ తొలగిస్తున్నారన్నారు. వందల ఎకరాలున్న వారికి రైతు బంధు ఎండుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూం, మూడెకరాల భూమి అంటూ మోసం చేసి మాట మార్చి ఇప్పుడు ఇంటి నిర్మాణానానికి మూడు లక్షల రూపాయలు, పది లక్షల దళిత బంధు అంటూ అవి కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. పిట్టల దొర మాదిరాగా మాటలతోనె పాలన చేస్తున్న కేసీఆర్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. నిత్యం పెరుగుతున్న ధరలతో సామాన్యుల జీవన చిత్రం చిద్రమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పేదలకు అందాల్సిన సంక్షేమ పతకాలు వెంటనే అందించాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పేదల మహా తీరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు. అనంతరం డిప్యుటీి తహసీల్దార్, ఎంపీడీఓకు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మేక అశోక్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు జల్లెల పెణటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, వనం ఉపేందర్, వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, నాయకులు కూరెళ్ల నరసింహా చారి, ఎంపీటీసీలు బడుగు రమేష్, ఎర్రోళ్ళ లక్ష్మమ్మనర్సింహ్మ, గాదె నరేందర్, బల్గూరి అంజయ్య, మీర్ ఖాజా అలీ, యండి రషీద్, బావండ్లపల్లి బాలరాజు, వేముల సైదులు, పిట్టల శ్రీనివాస్, గుండాల భిక్షం, గోగు లింగస్వామి, రాపోలు భాస్కర్, జోగుల శ్రీనివాస్, శానగొండ వెంకటేశ్వర్లు, ఆవనగంటి నగేష్ తదితరులు పాల్గొన్నారు.
ఒక్క పిలుపుతో అధిక సంఖ్యలో తరలివచ్చిన జనం..
పింఛన్లు, రేషన్ కార్డులు, దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇతర సమస్యల సాధన కోసం తరలిరండి అంటూ సీపీఐ(ఎం) ఇచ్చిన పిలుపు మేరకు మండల వ్యాప్తంగా ఉన్న బాధితులు ఉత్సాహంగా సోమవారం స్థానిక తహసీిల్దార్ కార్యాలయం వద్ద ధర్నాకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఏడేండ్ల టీిఆర్‌ఎస్ పాలనలో కేసీఆర్ ప్రభుత్వం హామీలను అట్టహాసంగా ఇస్తూ అమలను అరణ్యరోదన చేస్తుండటంతో విసిగి వేసారి పోతున్నా వివిధ సంక్షేమ పథకాలకు అర్హులైన పేదలు కుటుంబాలతో సహా పాలకుల నిలదీయడానికి సీపీఐ(ఎం) పార్టీ పిలుపు నందుకొని తరలిరావడం విశేషం. ఏండ్ల తరబడి పెన్షన్ కోసం, రేషన్ కార్డు కోసం, డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నామని పాలకులు ఎంత మాత్రం స్పందించడం లేదని మా వైపు చూసే ధైర్యం కూడా చేయకపోవడంతో పోరాటం చేస్తే తప్ప సంక్షేమ పథకాలను సాధించలేమని అర్థమవుతుందని పలువురు మహిళలు పాలకులపై శాపనార్థాలు పెడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హామీలు అమలు అయ్యేవరకు పోరాడుదాం
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
వలిగొండ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం అయిందని ప్రజలకు ఇచ్చిన హామీలు అమ్ములు అయ్యేవరకు పోరాడుతామని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి .జహంగీర్ అన్నారు. సోమవారం జిల్లా కమిటీ పిలుపుమేరకు మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి జహంగీర్ మాట్లాడుతూ బంగారు తెలంగాణ అని పేరు చెప్పి బతకలేని తెలంగాణగా మార్చి వేస్తున్నారని విమర్శించారు 2015 సంవత్సరం దరఖాస్తు చేసుకున్న అర్హులైన వికలాంగులు వితంతువులు వద్ధులు చేనేత గీత పెన్షన్లు ఇప్పటివరకు మంజూరు చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు , 57 ఏండ్ల వారికి పింఛన్లు , దళితులకు మూడెకరాల భూపంపిణీ, దళితబంధు వంటి హామీలు నీటిమూటలుగా మారాయన్నారు.మండలంలో 9070 పింఛన్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మూడు లక్షలు విలువ చేసే ఇల్లు ఇంటికి 15 లక్షలు ఇస్తామన్న బీజేపీ ప్రభుత్వం మాటే మార్చిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్నిటిని నెరవేర్చే వరకు పోరాటంచేస్తామని హెచ్చరించారు. మండల కార్యదర్శి సిరిపని స్వామి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య ,గడ్డం వెంకటేశం, మండల కార్యదర్శి వర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్ ,రామ్ చందర్, కూర శ్రీనివాస,్ మెరుగు వెంకటేశం, మండల కమిటీ సభ్యులు వాకిటి వెంకటరెడ్డి ,గాజుల ఆంజనేయులు ,ముత్యాలు ,దుబ్బ లింగం, కవి డే సురేష్ ,భీముని బోయ జంగయ్య ,పట్టణ కార్యదర్శి గర్దాస్ నరసింహ, నాయకులు బిక్షపతి ,గుండెపుడి నరసింహ, నగేష్ ,ఆనంద్, అమరేందర్ ,తదితరులు పాల్గొన్నారు.
భువనగిరిరూరల్ : అర్హత కలిగిన వారందరికి డబల్ బెడ్రూమ్ ఇండ్లు, వ్యక్తిగత ఇండ్ల నిర్మాణానికి మూడు లక్షల రూపాయలు,57 ఏండ్లు నిండిన వారందరికీ పెన్షన్స్, రేషన్ కార్డు లేని వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, మండలంలోని అన్ని గ్రామాలలో దళితులకు దళిత బంధు పథకము అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం భువనగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు దఫాలు ఎన్నికల సందర్భంగా ప్రజలకు అనేక వాగ్దానాలు అనేక సంక్షేమ పథకాలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించి గెలిచి ఎనిమిదేండ్లు గడుస్తున్నా ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదని విమర్శించారు. అనంతరం తహసీిల్దార్ వెంకట్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మాయ కష్ణ, మండల కార్యదర్శివర్గ సభ్యులు అన్నంపట్ల కష్ణ, కొండ అశోక్, మండల కమిటీ సభ్యులు సిలివేరు ఎల్లయ్య, ఎల్లముల వెంకటేష్, మోటె ఎల్లయ్య, అబ్దుల్లాపురం వెంకటేష్, కొండపురం యాదగిరి శాఖా కార్యదర్శులు నరాల చంద్రయ్య, కూకుట్ల కష్ణ,బొడ ఆంజనేయులు, ఏదునూరి వెంకటేష్, వడ్డెబోయిన వెంకటేష్, తోటకూరి ఐలయ్య, పాక జహంగీర్, వెంకటేష్, కొండ హైమావతి, కూకుట్ల చుక్క కుమారి, నరసమ్మ, సత్తమ్మ, సుగుణమ్మ, లలిత, బాలయ్య, కలమ్మ, బాలరాజులు పాల్గొన్నారు.
సంస్థాన్‌నారాయణపురం : ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దోనూరు నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం తహీసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 57 ఏండ్లు నిండిన వాళ్లందరికీ ,వితంతువులకు,వికలాంగులకు ఒంటరి మహిళలకు పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి దొడ యాదిరెడ్డి, జి శ్రీనివాసాచారి, దొంతగాని పెద్దలు,సుర్కంటి శ్రీనివాస్ రెడ్డి, జనిగల యాదయ్య, పిట్ట రాములు, శివశెట్టి లాలయ్య, కర్తాల భిక్షం, సుక్క కష్ణ, పంకర్ల యాదయ్య, రాచకొండ కష్ణ, మేకల సత్తయ్య, సురవి కష్ణ బొమ్మగొని శంకరయ్య, చాడ నరసింహ పాల్గొన్నారు.