Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- యాదగిరి గుట్ట
జులై 16 నుండి 18 వరకు హర్యానాలో జరిగే ఆలిండియా రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ యూనియన్ ఆలిండియా మహాసభలను జయప్రదం చేయాలని ఏఐఆర్టిడబ్ల్యూ ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లేశం కార్మికులకు పిలుపు నిచ్చారు. సోమవారం యాదగిరిగుట్టలో అటో అడ్డాల వద్దకు వెళ్లి మహాసభల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టం -2019 ట్రాన్స్ పోర్ట్ కార్మికులకు ఉపాధి కోల్పోయే పరిస్థితి నెలకొందని విమర్శించారు. మహాసభల జయప్రదం కోరుతూ ప్రతి కార్మికుడు రూ.50 విరాళం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ బబ్బూరి పోశెట్టి, అటో యూనియన్ అద్యక్షులు యాదగిరి, నర్సింహ, నాయకులు శంకర్ , కోట చంద్ర శేఖర్, సతీష తదితరులు పాల్గొన్నారు.