Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దిగువకు నీటి విడుదల
నవతెలంగాణ -కేతెపల్లి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండవ పెద్ద ప్రాజెక్ట్ అయిన మూసీి రిజర్వాయరు పూర్తి స్థాయిలో నిండింది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని క్రమబద్ధీకరించడం కోసం సోమవారం అధికారులు ప్రాజెక్టు 3,7 ,10 క్రస్ట్ గేట్లను ఒక అడుగు ఎత్తు మేరలో ఎత్తి దిగువకు 1979 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 644. 35 అడుగుల వద్ద స్థిరంగా ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4. 24 టీఎంసీల నీరు నిల్వ ఉంది.ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడం తో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ప్రాజెక్టు ఇంజనీర్ ఉదరు కుమార్ తెలిపారు. మూసీ దిగువ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.