Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాలడుగు ప్రభావతి
నవతెలంగాణ -నల్లగొండ
మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల ఆహార భద్రత, ఆకలి లేని జీవితం- రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాలడుగు ప్రభావతి అన్నారు. సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని సుభాష్ విగ్రహం వద్ద సంతకాల సేకరణ చేపట్టి మాట్లాడారు. నేడు దేశంలో నిరుద్యోగం పెరగడం వల్ల ఆదాయాన్ని కోల్పోయి దానికితోడు రోజూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో అన్నివర్గాల ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందన్నారు. మహిళలు పిల్లలు పోషకాహారం దొరకని పరిస్థితిలో అనారోగ్యం పాలవుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత కోసం బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఆహార భద్రత పథకాన్ని సార్వత్రికం చేయాలని, 14 రకాల సరుకులు పప్పులు నూనె పంచదార వాటికి సబ్సిడీ రేట్లకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జూలై 4న ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నాకు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండా అనురాధ, జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ, జిల్లా సహాయ కార్యదర్శి భూతం అరుణ కుమారి, జిల్లా కమిటీ సభ్యురాలు కనుకుంట్ల ఉమారాణి, శ్రీవేణి, కవిత పాల్గొన్నారు.