Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మీ, షాదీము బారక్ 35 మంది లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడపిల్లలు వున్న తల్లులు చదువుల తర్వాత పిల్లల పెండ్లి సమయానికి ఇబ్బందులు పడకుండా సంతోష పడేలా కేసీఆర్ రూ:లక్షా 16 వేల రూపాయలు కళ్యాణ లక్ష్మీ,షాదీముబారక్ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు.లబ్దిదారులు ప్రతి ఒక్కరూ పొలాల గట్లలలో మీరు కోరుకున్న 10 మొక్కలు గ్రామపంచాయతీలలో తీసుకెళ్లి నాటాలన్నారు.,ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిందని, పిల్లలను పాఠశాలలకు పంపాలని తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ తాండ్ర అమరావతి,జెడ్పీడీసీ కోలుకొండ లక్ష్మీ,జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండి ఖలీల్,వైస్ ఎంపీపీ మహేశ్వరం మహేందర్ రెడ్డి,తహసీల్దార్ శ్రీనివాస రాజు,ఎంపిడిఓ జి శ్రీనివాసులు,సర్పంచ్ చిందం వరలక్ష్మి,ఎంపీటీసీ కుంచాల సుశీల,మార్కెట్ వైస్ చైర్మెన్ మూగల శ్రీనివాస్,సర్పంచ్,ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సైదులు,శ్రీశైలం నాయకులు సోమిరెడ్డి, రామకష్ణారెడ్డి,పాండరీ గౌడ్,రాములు, వేణుగోపాల్,దశరథ గుప్తా,మల్లేష్ ఆయా గ్రామాల సర్పంచ్,ఎంపీటీసీ లు తదితరులు పాల్గొన్నారు.