Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
ప్రభుత్వఅనుమతులు లేకుండా కార్నర్ స్టోన్ స్కూల్ నడుపుతున్న ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం స్కూల్ ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కొర్రా సైదానాయక్ మాట్లాడారు.పుస్తకాల పేరుతో పేద విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని విమర్శించారు.ప్రభుత్వ విద్యాశాఖ అన.ుమతులు లేకుండా స్కూల్ నిర్వహిస్తున్న కార్నర్ స్టోన్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్నారు.పట్టణంలో ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వ గవర్నర్ బాడీ నియమించిన ఫీజులు మాత్రమే ప్రయివేట్ పాఠశాలలో తీసుకోవాలని, ప్రయివేట్ పాఠశాల ఫీజు నోటీస్ బోర్డులో అందుబాటులో ఉంచాలన్నారు.విద్యా హక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు 25 శాతం మంది విద్యార్థులకు ఉచిత విద్యను అందించాలని డిమాండ్ చేశారు.గుర్తింపు లేని పాఠశాలలు గుర్తించి యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు .వెంటనే విద్యాశాఖ అధికారులు మిర్యాలగూడెం ప్రయివేట్ పాఠశాలలో సందర్శించి ప్రభుత్వ నిబంధనలు పాటించని పాఠశాలల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు.లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు జగన్నాయక్, దామరచర్ల మండల కార్యదర్శి వీరన్న, టౌన్ నాయకులు సమద్, తరుణ్, ఉపేందర్, సోను, మధు, మణికంఠ,నరేష్,సాయిపవన్, బిస్మిల్లా,గణేష్, పరమేష్,తరుణ్ పాల్గొన్నారు.