Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర హరితహారం కార్యక్రమం కొనసాగుతుందని మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ అన్నారు.మంగళవారం పురపాలక సంఘం పరిధిలోని జాతీయ రహదారికి పక్కన ఉన్న పట్టణ ప్రకతివనంలో 8వ విడత హరితహరం కార్యక్రమాన్ని పరిశీలించి మాట్లాడారు.ప్రభుత్వం హరితహరం ద్వారా పచ్చదనాన్ని పెంచడం దేశానికే ఆదర్శమన్నారు.త్వరలో ఇంకెన్నో వినూత్న కార్యక్రమాలు చేసి కోదాడ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మెప్మా విభాగానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్ ధరావత్ కైలా స్వామినాయక్, సీఓ సాయికష్ణ, ఏఈ వరుణ్, శేఖర్, భవాని, శారద, విజయేందర్‌రెడ్డి, మెప్మా, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.