Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శంకర్ మఠ్ ఏర్పాటు
- కంచికామకోటి పీఠాధిపతి శ్రీ పరమహంస పరివాజ్య్రకాచార్య విజయేంద్ర సరస్వతిస్వామి
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
మండలపరిధిలోని గోపలాయపల్లిలో గల శ్రీవారిజాల వేణుగోపాల స్వామి దేవస్థానంలో శిల్పకళలను ప్రోత్సహించేందుకుగాను శిల్పాకళాశాస్త్ర పాఠశాల, గుట్టకింది భాగంలో శంకర్మఠ్ను ఏర్పాటు చేయనున్నట్టు కంచికామకోటి పీఠాధిపతి శ్రీ పరమహంస పరివాజ్య్రకాచార్య విజయేంద్ర సరస్వతిస్వామి పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా ఆలయ అనువంశిక వ్యవస్థాపక ధర్మకర్త కోమటిరెడ్డి మోహన్రెడ్డ్డిిరాజేశ్వరిదేవీలు ఆలయ ఆచారం ప్రకారం స్వామికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.గట్టుపై గల వేదపాఠశాలను ఆలయ ప్రాంగణాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు.సర్వకోటి జనులు సుభిక్షంగా ఉండేందుకుగాను ఈ ఆలయ ప్రాంగణం నెలకొందన్నారు. అంతకుముందు ఆయన ఆలయంలో పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, వేదపాఠశాల ప్రధానోపాధ్యాయులు చేబియ్యంరాఘవశర్మ,ఆ గ్రామసర్పంచ్ గోసులభద్రాచలం,నార్కట్‌పల్లి సర్పంచ్ దూదిమెట్లస్రవంతి పాల్గొన్నారు.