Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
స్కూల్ టీచర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్త క్యాంపెయిన్‌లో భాగంగా ప్రభుత్వ విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నేరేడుచర్ల మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.తహసీల్దార్ వాసిమల్ల సరితకు వినతిపత్రం అందజేశారు.ఈసందర్భంగా టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు సిరికొండ అనిల్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగంలో ఏండ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని కోరారు.పాఠశాలలో స్వచ్ఛ కార్మికులను నియమించాలని పాఠ్యపుస్తకాలను సరఫరా చేయాలని, ఏకరూప దుస్తులు వెంటనే అందించాలని కోరారు.మధ్యాహ్న భోజన బిల్లులను వెంటనే మంజూరు చేయాలని ఎన్ఈపీ-2020 నూతన విద్యావిధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.కాంట్రాక్టర్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, ఉపాధ్యాయుల బదిలీల ప్రమోషన్ షెడ్యూల్ ను వెంటనే విడుదల చేయాలని కోరారు. నూతన ఉపాధ్యాయుల నియామకం జరిగే వరకు తాత్కాలిక ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సైదులునాయక్,ప్రధాన కార్యదర్శి అక్కయ్యబాబు,ఉపాధ్యక్షులు వై. కష్ణయ్య, కోశాధికారి కె.ఎల్లయ్య, సీనియర్ నాయకులు నర్సింహారావు, వెంకటేశ్వర్రావు, వెంకట నర్సయ్య, వెంకటేశ్వర్లు, ఎండి రషీద్, రమేవ్, విజరుశేఖర్, ఎం.కృష ్ణప్రసాద్, సీఐటీయూ మండలకన్వీనర్ నీలారామ్మూర్తి పాల్గొన్నారు.