Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలోని రిజిస్టర్ అయి గుర్తింపు లేని పొలిటికల్ పార్టీల వివరాలను తెలపాలని ముఖ్య ఎన్నిక్షల అధికారి వికాస్‌రాజ్ అన్నారు.మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుండి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో రిజిస్టర్ అయి గుర్తింపు లేని పొలిటికల్ పార్టీలకు నోటిసులు జారీ చేసి అట్టి వివరాలను అందించాలని కలెక్టర్లకు సూచించారు.కొన్ని జిల్లాలో ఇచ్చిన అడ్రస్‌లలో లేకపోవడంతో నోటిసులు జారీ చేయలేక పోయామని తెలిపారు. వీసీలో భాగంగా అదనపు కలెక్టర్ మోహన్‌రావుతో కలిసి కలెక్టర్ టి.వినరుకష్ణారెడ్డి మాట్లాడారు. జిల్లాలో రిజిస్టర్ అయి గుర్తింపు లేని పొలిటికల్ పార్టీ సూర్యాపేట జిల్లాలో ఒకటి ఉన్నదన్నారు.ఆ పార్టీకి సంబంధించిన నోటీసులు ఇప్పటికే జారీ చేశామన్నారు.ఆ పొలిటికల్ పార్టీ ద్వారా 15 రోజులలో సంబంధిత లావాదేవీలపై సమర్పి ంచేలా చర్యలు చేపడతామని వివరించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పర్యవేక్షకులు పద్మారావు, డీటీ కల్యాణ్, సిబ్బంది పాల్గొన్నారు.