Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-చౌటుప్పల్
జీవితాంతం విప్లవ మార్గాన్ని ఎంచుకొని కార్మికులు, కష్టజీవులు, వ్యవసాయ కూలీల హక్కుల కోసం అనేక పోరాటాలకు నాయకత్వం వహించిన పోరాటయోధుడు రొడ్డ అంజయ్య ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు తెలిపారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కామ్రేడ్ రొడ్డ అంజయ్య సంతాపసభను నిర్వహించారు. ఈ సందర్భంగా అంజయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీతారాములు మాట్లాడారు. పేద ప్రజల సమస్యలపై నిరంతరంగా అంజయ్య రాజీలేని పోరాటాలు నిర్వహించారని తెలిపారు. వ్యవసాయ కూలీలు, రైతాంగం, కల్లుగీత కార్మికుల సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహించారన్నారు. జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ మాట్లాడారు. ఉపాధి హామీ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అంజయ్య వివిధ సంఘాల నిర్మాణాన్ని చేపట్టారన్నారు. అనేక పోరాటాలకు నాయకత్వం వహించి వారి సమస్యల పరిష్కారానికి ఎనలేని కషిచేశారని కొనియాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం నిరంతరం పనిచేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షులు బుర్రి ప్రసాద్, సీపీఐ(ఎం) రాష్ట్రకమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా, బట్టుపల్లి అనురాధ, జిల్లా కమిటీ సభ్యులు ఎమ్‌డి.పాషా, బూర్గు కష్ణారెడ్డి, మండల, మున్సిపల్ కార్యదర్శులు గంగదేవి సైదులు, బండారు నర్సింహా, మున్సిపల్ వైస్‌ఛైర్మన్ బత్తుల శ్రీశైలం, ఫ్లోర్‌లీడర్ గోపగోని లక్ష్మణ్, నాయకులు తడక మోహన్, గోశిక కరుణాకర్, బత్తుల దాసు, రాగీరు కష్ణయ్య, బొజ్జ బాలయ్య, రొడ్డ భగత్, జటంగి కష్ణ, బుచ్చిరెడ్డి, రాంరెడ్డి పాల్గొన్నారు.