Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి కొండ అనురాధ
నవతెలంగాణ -నల్లగొండ
రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై జులై 4 వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి.కొండా అనురాధ .పిలుపునిచ్చారు.మంగళవారం నల్గొండ మండలం లోని అన్నారెడ్డి గ్రామంలో మహిళలతో కలిసి సంతకాల సేకరణ చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రెండు నెలల పాటు ఐద్వా నిర్వహించిన సర్వేలో వెలుగులోకి వచ్చిన సమస్యలు రేషన్ కార్డు,ఫించన్లు,డబుల్ బెడ్రూం ఇళ్ళు,రోడ్లు, డ్రయినేజీ, మంచినీటి సమస్యలు పరిష్కరించాలని ఆద్యమాలు నిర్వహించి వినతిపత్రాలు అందజేసినట్టు తెలిపారు..ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ధర్నా ను జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాళ్లు,నాగమణి,కరుణమ్మ,మంగ, జానమ్మ, కష్ణవేణి, సరిత,ఎల్లమ్మ,రాములమ్మ, పార్వతమ్మ, రాధ, తదితరులు పాల్గొన్నారు.