Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోదీన్‌పురం గ్రామంలో నిరుద్యోగ నిరాహార దీక్ష
- వైఎస్ఆర్ టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్.షర్మిల
నవతెలంగాణ-చివ్వెంల
సీఎం కేసీఆర్ నిర్లక్యం ఫలితంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల అన్నారు.నిరుద్యోగ నిరాహార దీక్షలో భాగంగా మోదిన్ పురం గ్రామంలో చేపట్టిన నిరుద్యోగ నిరాహారదీక్షలో ఆమె మాట్లాడారు. నిరుద్యోగుల విషయంలో కేసీఆర్ తీరని అన్యాయం చేశారన్నారు.నిరుద్యోగ సమస్య తెలంగాణ అత్యధికంగా ఉందని,కేసీఅర్ నిర్లక్యమే కారణమన్నారు.కండ్ల ముందు రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదన్నారు.ఉద్యోగ నోటిఫికేషన్లు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న దున్నపోతు మీద వానపడ్డట్లు... కేసీఅర్కు చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు.వందల మంది కేసీఆర్ పేరు రాసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.ఇవి ఆత్మహత్యలు కాదు,కేసీఅర్ చేస్తున్న హత్యలని తెలిపారు.ముష్టి రూ.35 వేలు ఫీజు రీయీంబర్స్‌మెంట్ ఇచ్చి కేసీఅర్ గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.కేసీఅర్కు భాధ్యత లేదు... ఉంటే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేవారన్నారు.
8 ఏండ్లుగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేయకుండా ఇప్పుడు 80 వేలు అని ఒక మాట...30 వేలు అని ఒక మాట...15 వేలు అని ఒక మాట అంటున్నార న్నారు.ఒక్కో ఉద్యోగానికి 800 వందల మంది పోటీ ఉందట..8 ఏండ్లుగా నోటిఫికేషన్లు వేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని తెలిపారు.3 లక్షలా 85 వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది, కాని 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాను అంటే...మిగతా ఉద్యోగాలు కేసీఅర్ మింగేశాడా, లేక కేసీఅర్ ఫామ్ హౌజ్ మీద వాలిన కాకి ఉద్యోగాలు ఎత్తుకుపోయిందా అని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కు అమ్ముడు పోయారన్నారు.బీజేపీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలని మోసం చేసిందన్నారు.బీజేపీ కనీసం తెలంగాణకు 20 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు.ప్రజల పక్షాన కేవలం వైఎస్సార్ తెలంగాణ పార్టీ మాత్రమే నిలబడిందన్నారు.అనంతరం ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా జగ్గుతండా, సంగోనితండా, పాండ్యనాయక్తండాలో పాదయాత్ర సాగింది.పలు కార్యక్రమాలలో పిట్ట రాంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మూగ వెంకట్రాంరెడ్డి, రఫీ, మల్సూర్, లింగారెడ్డి పాల్గొన్నారు.