Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-మిర్యాలగూడ
అగ్నిపథ్తో యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ లక్ష్మారెడ్డి అన్నారు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ అజారుద్దీన్ ఆధ్వర్యంలో అగ్నిపథ్ కి వ్యతిరేకంగా శుక్రవారం స్థానిక మున్సిపల్ కాంప్లెక్స్ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగాన్ని ప్రయివేటికరణ చేస్తూ ప్రజల సంపదను దోచుకు తింటున్నారని ఆరోపించారు. దేశ సేవ చేసే జవాన్లకు కేవలం నాలుగు సంవత్సరాల వీధిలో ఉంచుకొని వారిని రిటర్మెంట్ చేయడం సరికాదని , అగ్నిపథ్ రద్దు చేసేంతవరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో , పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణు గోపాల్ రెడ్డ, పీసీసీ సభ్యులు చిరుమర్రి క్రిష్నయ్య,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తమ్మడబోయిన అర్జున్, కౌన్సిలర్లు గంధం రామక్రిష్ణ, దేశిడి శేఖర్ రెడ్డి, జానీ క్రికెటర్, రవి నాయక్,తదితరులు పాల్గొన్నారు.