Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి
నవతెలంగాణ -హుజూర్ నగర్
పట్టణ కేంద్రంలోని పోలీస్ అధికారులు పక్షపాత వైఖరిని నిసిగ్గుగా అవలంబిస్తున్నారని పార్లమెంట్ సభ్యుడు ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు .శుక్రవారం జర్నలిస్టు ఎలుక సైదులు పై జరిగిన దాడికి సంబంధించి సిఐ రామలింగారెడ్డికి వినతిపత్రం సమర్పించిన అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆయన మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రోత్సాహంతో ఇటీవల కాలంలో విలేకరులపై సామాన్లపై దాడులు పెరిగాయని దీనికి విలేకరులు ఐకమత్యం లేకపోవడమే ప్రధాన కారణం అన్నారు ఇప్పటికైనా విలేకరులు ఐకమత్యంతో ఉండాలని ఆయన సూచించారు ఇటీవల టౌన్ హాలు నందు ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చిన సింగం మోహన్ రావు అనే వ్యక్తిపై ,జర్నలిస్టు ఎలక సైదులుపై జరిగిన దాడిన ఆయన ఖండించారు. జిల్లా కలెక్టర్ వి కష్ణారెడ్డి ఎమ్మెల్యే సైదిరెడ్డి మరియు జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఒత్తిడికి తలోగ్గి వారి ఆదేశానుసారమే ఈఎస్ఐ ఆసుపత్రిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను నింపటానికి టెండర్ పద్ధతిలో కాకుండా నామినేషన్ పద్ధతిలో అనుమతి ఇచ్చాడన్నారు. లీన ఏజెన్సీకి ఈ ఉద్యోగాలు నింపుకోవడానికి అనుమతి ఇవ్వడంతో 18 మంది నిరుద్యోగుల వద్ద మూడు లక్షల రూపాయల చొప్పున 54 లక్షల రూపాయలు వసూలు చేశారని తెలిపారు. దాంట్లో మోహన్ రావు కూడా మూడు లక్షల రూపాయలు ఇచ్చినప్పటికీ తనకు సంబంధించిన ఉద్యోగం రాకపోవడంతో హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చాడన్నారు. ఈ మోహన్ రావు కూడా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని తెలిపారు మోహన్ రావు మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తుండగా ఒకసారి దాడి చేశారని ,రండవ సార్లు టౌన్ హాలు నందు ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చిన సందర్భంలో అందరి సమక్షంలో మోహన్ రావు తో పాటు ఎలుక సైదులు పై కూడా టిఆర్ పార్టీ వారు దాడీ చేశారన్నారన్నారు. ఈ విషయమే హుజూర్నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ విచారణ చేస్తున్నామని తేలికగా చెప్పారన్నారు. అంతే కాకుండా ఇటీవల మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి తన సంతకం ఫోర్జరీ జరిగిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడని, మున్సిపల్ ఏఈ పిచ్చయ్య ఆర్ ఐ తన పాస్వర్డ్ దొంగలించబడ్డాయని ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు తీసుకున్న చర్యలు ఏమీ లేవన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పోలీసుల విషయమై ఉన్నతాధికారులకు తాను ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి తన్నీరు మల్లికార్జున్ రైల్వే బోర్డు మెంబర్ వై నాగన్న సీనియర్ నాయకులు సామల శివారెడ్డి అరుణ్ కుమార్ దేశ్ముఖ మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రావణ్ కుమార్ చంద్రశేఖర్ సైదులు తదితరులు పాల్గొన్నారు.