Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్య శాఖకు కార్యాలయం కేటాయింపు
నవతెలంగాణ- భువనగిరి రూరల్
కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు కార్యాలయాన్ని కేటాయించగా శుక్రవారం డాక్టర్స్ డే సందర్భంగా కార్యాలయాన్ని కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లికార్జునరావు, ఇతర డాక్టర్లను కలెక్టర్ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖను ముందుకు తీసుకెళ్లాలని, సాధారణ కానుకలను పెంచాలని సూచించారు. ఆరోగ్య ఇండికేటర్లలో ప్రగతి సాధించిందని ప్రశంసిస్తూ ఇంకా ప్రగతి సాధించాలని సూచించారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె మల్లికార్జునరావు మాట్లాడుతూ డాక్టర్లు, వైద్య సిబ్బంది అందిస్తున్న ఆరోగ్య సేవలను కొనియాడారు. డాక్టర్లు కషిచేసి జిల్లాను అన్ని ఆరోగ్య సూచీలలో ముందు ఉంచాలని, మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థల) దీపక్ తివారి, (రెవెన్యూ) జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, జిల్లాస్థాయి అధికారులు జిల్లా ఉపవైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ప్రోగ్రాం అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.