Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డార్జిలింగ్ పార్లమెంట్ సభ్యులు రాజీవ్ బిస్తా
నవతెలంగాణ- ఆలేరు టౌన్
టీఆర్ఎస్ పొలిటికల్ పార్టీ కాదని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని డార్లీ డార్జిలింగ్ పార్లమెంటు సభ్యులు రాజీవ్ బీప్తా అన్నారు. నియోజకవర్గ కేంద్రంలో రెండు రోజులుగా బిజెపి అనుబంధ సంఘాలు, వివిధ విభాగాలకు చెందిన ముఖ్యులతో ఏ ఎన్ ఆర్ గార్డెన్లో మాజీ శాసనసభ్యులు, బిజెపి రాష్ట్ర నాయకులు బూడిద భిక్షమయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ ప్రజల కోసం పని చేయడంలో టీఆర్ఎస్ పార్టీ విఫలమైందన్నారు . ప్రజల కోసం గత 8 సంవత్సరాల కాలంలో దేశంలో ఎలాంటి అవినీతి కి తావు లేకుండా నరేంద్ర మోడీ 18 గంటలు పనిచేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ 18 గంటలు పామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారని అన్నారు . తెలంగాణలో రానున్న కాలంలో గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి బిజెపి కార్యకర్తలు ఇంటింటికి తిరిగి మోడీ పథకాలను వివరించాలని కోరారు. నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాలతో సర్జికల్ స్ట్రైక్ చేసి దేశభద్రతను కాపాడాలన్నారు .8 సంవత్సరాల పాలనలో దేశంలో ఉన్న అన్ని వర్గాలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎస్టీ రైతుల అభ్యున్నతి కోసం నరేంద్ర మోడీ కష్టపడుతున్నాడని వివరించారు. 75 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ చేయనిది ఎనిమిది సంవత్సరాల కాలంలో మోడీ చేసి చూపించారని,
30 నెలలపాటు ప్రతి పేదవాడికి 5 కేజీల బియ్యం ఇస్తున్న ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చెందుతుందన్నారు . కోట్ల మందికి జనధన్ ఖాతాలు తెరిపించాడని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇక్కడ అమలు కావడం లేదని , కేసీఆర్ మాత్రం ఇల్లు కట్టుకుంటున్నాడని ఎద్దేవా చేశారు . ఆడపిల్లలకు ఫ్రీ గ్యాస్ , ఆడ తల్లులు గౌరవం కోసం ప్రతి ఇంటికి మరుగుదొడ్లు, రైతులకు 6000 రూపాయలు ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి ద్వారా అందిస్తుందన్నారు . ఉచిత కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీది కి చెందుతుందన్నారు. బిజెపి రాష్ట్ర నాయకులు బూడిద భిక్షమయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మాయమాటలతో సబండవర్గాలను మోసం చేస్తున్నాడని, అధికారంలోకి వచ్చి డబుల్ బెడ్ రూమ్ ఇయ్యలేదని,. నిరుద్యోగ భతి,. దళిత బంధు,. ఎస్టీలకు రిజర్వేషన్లు , దళితులకు మూడు ఎకరాల భూమి, రైతులకు రుణమాఫీ, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు . బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్య వైద్యం ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు . ఈ నెల 3 వ తేదీన సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ మైదానంలో జరిగే బహిరంగ సభ కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కానున్నారని సభ ను విజయవంతం చేయాలని బిజెపి కార్యకర్తలకు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి దాసరి మల్లేశం, నాయకులు చిరిగి శ్రీనివాసు, రాఘవులు నరేందర్,కాదురి అచ్చయ్య ,బాబ్బూరి రవీంద్రనాథ్, జంపాల దశరథ, దూసరి రాఘవేంద్ర, బడుగు జహంగీర్, దశరథా, ఏయన్నార్ నర్సింహారెడ్డి ,పులి పలుపుల మహేష్ ,దయ్యాల సంపత్, లక్ష్మీనారాయణ, సాంగ్ భూపతి, ఆంజనేయులు, పుట్టా పవన్, కలెం రాజు, ఆయిల్ సందీప్ పాల్గొన్నారు.