Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
ఎన్ఈఎఫ్ను రద్దు చేసి ప్రభుత్వ పాఠశాలలను కాపాడాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా అమలు జరుపుతున్న ఎన్ఈఎఫ్-2020ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలని. , సీపీఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునర్ధరించాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో ఉన్న కాళీ పోస్టులను పదోన్నతులు, బదిలీలు, నియమాకాల ద్వారా వెంటనే భర్తీ చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, ఆంగ్ల మాధ్యమం బోధన కోసం అవసరమైన అదనపు ఉపాధ్యాయులను నియమించాలన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి గారు ధర్నాకు సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంటాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంటాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి నాగమణి మాట్లాడుతూ మన ఊరు- మనబడి పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని పాఠశాల అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు, ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం ఉపాధ్యక్షులు బక్కా శ్రీనివాస చారి, అరుణ, కోశాధికారి శేఖర్ రెడ్డి, జిల్లా కార్యదర్శులు రాజశేఖర్, శ్రీనివాస్ రెడ్డి, అరుణ, గేర నరసింహ్మ, రాజు, వై.శ్రీను, రమాదేవి, నలపరాజు వెంకన్న, కన్వీనర్ నాగిరెడ్డి ,ఉపేందర్, జిల్లా అధ్యక్షులు పాల్వాయి అంజిరెడ్డి, గురుకులాల నల్గొండ జిల్లా కన్వీనర్ రాంబాబు మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కార్యకర్తలు పాల్గొన్నారు.
భువనగిరి రూరల్: ప్రభుత్వ విద్యారంగా, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు ముక్కేర్ల యాదయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మెతుకు సైదులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు జరుపుతున్న ఎన్ఈఎఫ్- 2020 ను రాష్ట్రంలో తిరస్కరించాలని కోరారు. సీపీఎస్ ను రద్దుచేసి, ఓపీిఎస్ ను పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఎస్ యుటిఎఫ్ ఉపాధ్యక్షులు సంగు వనిత, జిల్లా కార్యదర్శులు బి ముత్యాలు, కే రాజగోపాల్, ఎస్ సుధర్మ రెడ్డి, ఏ వెంకటాచారి, పి మోహన్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఈ సరోజ, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు పి గోపాలకష్ణ, కే శ్రీనివాస్, వివిధ మండలాల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు , మహిళా నాయకత్వం విజయలక్ష్మి, లీలావతి, సోషల్ మీడియా కన్వీనర్ అనిల్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు ఉప్పలయ్య, కె రవికుమార్, వెంకటరెడ్డి, సంజరు, శ్రీనివాస్ రెడ్డి లు పాల్గొన్నారు.