Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
తుంగతుర్తి నియోజకవర్గంలో అర్హులైన వారందరికీ దళితబంధు పథకాన్ని వర్తింపజేయాలని కోరుతూ శుక్రవారం వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద ఆ పార్టీ తుంగతుర్తి నియో జకవర్గ ఇన్చార్జి రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపూరి సోమన్న ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుంగతుర్తి నియోజ కవర్గంలో పార్టీల కతీతంగా అందరికీ దళిత బంధువు వర్తింపజేయాలని కోరారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ టీిఆర్ఎస్ పార్టీలో చేరితేనే దళిత బంధు ఇస్తామని చెప్పి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.టీఆర్ఎస్ కండువా కప్పుకుంటేనే దళితబంధు ఇస్తారా ఇదెక్కడి న్యాయమని ఆయన ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర కన్వీనర్ పేరాలయాదగిరి,నల్లగొండ జిల్లా అధ్యక్షులు ఇజం నర్సిరెడ్డి, కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు పచ్చిపాల వేణుయాదవ్, నాయకులు కడారికుమార్ పాల్గొన్నారు.