Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
మున్సిపాలిటీ 9వ వార్డు నందపురంలో శుక్రవారం గొర్ల మేకల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో యాదవులందరికీ రెండో విడత నగదు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కౌన్సిలర్ కన్నెబోయినరేణుకలక్ష్మయ్యకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా జీఎంపీఎస్ జిల్లా అధ్యక్షులు, సీపీఐ(ఎం) మండలనాయకులు కడెం లింగయ్య మాట్లాడారు.18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్క యాదవునికి దళితబంధులాగా రూ.5లక్షలు అకౌంట్లో వేయాలని కోరారు. 50 ఏండ్లు నిండిన ప్రతి కాపరికి నెలకు 5వేల రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.కాపరులందరికీ జీవితబీమా లైఫ్ ఇన్సూరెన్స్ వసతులు కల్పించాలని కోరారు.ప్రమాదవశాత్తు చనిపోయిన కాపరికి రైతుబంధులాగా పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరారు.దేవాలయ, పోరంబోకు భూములను కాపరులకు అప్పగించాలని కోరారు.వినతిపత్రం అందజేసిన వారిలో ఆ సంఘం మండలకార్యదర్శి కన్నెబోయిన లింగమల్లు, కన్నెబోయిన రేణుక, కన్నెబోయిన వెంకన్న, చిరబోయిన సోమల్లు, రాజు, కన్నెబోయిన ఆవులయ్య ఉన్నారు.