Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ఆడపడుచులకు సారేగా చీరలను పంపిణీ చేస్తున్నామని జెడ్పీ చైర్పర్సన్ గుజ్జదీపికాయుగంధర్‌రావు అన్నారు.శుక్రవారం మండలపరిధిలోని దేవునిగుట్ట తండా గ్రామపంచాయతీలో బతుకమ్మ చీరలను ఆమె పంపిణీ చేసి మాట్లా డారు.సీఎం కేసీఆర్ చేనేత కార్మికులకు చేయూతనివ్వడంతో పాటు,ఆడబిడ్డలకు చిరుకానుక ఇవ్వాలన్న మహోన్నత లక్ష్యంతో 2017లో చీరల పంపిణీ ప్రారంభించినట్టు తెలిపారు.24 రకాల డిజైన్లు,10 రంగులు,240 రకాల థ్రెడ్ బార్డర్‌తో ఆకర్షణీయంగా తయారుచేసి పంపిణీ చేస్తున్నామన్నారు. మండలంలో సుమారు 15442 మంది మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, స్థానిక సర్పంచ్ గుగులోత్ ఈరోజి, ఎంపీటీసీ ఆంగోతు నరేష్,టీిఆర్‌ఎస్ జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్, తహసీల్దార్ రాంప్రసాద్, ఎంపీడీఓ భీంసింగ్నాయక్, స్థానిక సెక్రెటరీ జగదీశ్ పాల్గొన్నారు.