Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికులకు 25 శాతం ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
ప్రీమియర్ యాజమాన్యం 8.33 శాతం మాత్రమే కార్మికులకు బోనస్ ఇస్తామని, సీలింగ్ దాటిన కార్మికులకు బోనస్ ఏమి ఇవ్వమని చెప్పడం సరికాదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి, ప్రిమియర్ యూనియన్ అధ్యక్షులు భూపాల్ అన్నారు. శుక్రవారం ఆ పరిశ్రమ గేట్ ముందు సీఐటీయూఆధ్వర్యంలో చేపట్టిన ఒక్కరోజు నిరసన దీక్షను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కోట్ల రూపాయల లాభాలతో ముందుకు వెళ్ళుతున్న ప్రీమియర్ యాజమాన్యం 8.33 శాతం మాత్రమే కార్మికులకు బోనస్ ఇస్తామని, సీలింగ్ దాటిన కార్మికులకు బోనస్ ఏమి ఇవ్వమని చెప్పడాన్ని సీఐటీయూ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. 1965 బోనస్ చట్టం ప్రకారం ఫ్యాక్టరీ నష్టాల్లో ఉన్నా, మూసేసినా తక్కువలో తక్కువ 8.33 శాతం బోనస్ ఇవ్వాలని చట్టం చెప్పుతుందన్నారు. ప్రీమియర్ ఫ్యాక్టరీ మాత్రం రగ్యులర్ గా ఉత్పత్తిని తీస్తూ లాభాలను గడిస్తున్న కేవలం 8.33 శాతమే చెల్లిస్తామని చెప్పడమంటే కార్మికులకు నష్టం చేకూర్చడమే అవుతుందన్నారు. లాభాలతో ముందుకు పోతున్న యాజమాన్యం వెంటనే 20 శాతం బోనస్ అదేవిధంగా సీలింగ్ దాటిన కార్మికులకు 25 శాతం ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. గుర్తింపు యూనియన్ అయిన టిఆర్ఎస్కేవి మరో సారి కార్మికులను మోసం చేయుద్దన్నారు. గుర్తింపు ఎన్నికల సందర్భంగా కార్మికులకు చెప్పిన విధంగా బోనస్ 20 శాతం ఇప్పించాలని డిమాండ్ చేశారు. గుర్తింపు యూనియన్ ,యాజమాన్యం కార్మికులకు నష్టం చేయాలని చూస్తే సీఐటీయూ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. వేతన ఒప్పందం గడువు ముగిసి ఆరు మాసాలు అవుతున్నా అగ్రిమెంట్ చర్చల్లో పురోగతి లేదన్నారు. గుర్తింపు యూనియన్ కార్మికులకు చెప్పిన విధంగా 11 వేలు వేతనం పెంచాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు, యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి చంద్రారెడ్డి, యూనియన్ ప్రధాన కార్యదర్శి పుప్పాల గణేష్, సర్పంచ్ బీమగాని రాములు, నాయకులు రేగు బాలనర్సింహ, సిహెచ్ రమేశ్, బోడ వెంకటయ్య, సుబ్బూరు సత్యనారాయణ, మంగ వెంకటేశ్, కందుల గణేష్, గుండ్లపల్లి నగేశ్, జె వెంకటేశ్, పి స్వామి, ఐలయ్య, గంగయ్య, జె శ్రీను, శ్రీనివాస్ రెడ్డి, పి సత్యనారాయణ, అన్నపూర్ణ, లలిత, బాలమణి, అనసూర్య, కరుణాకర్, వినీత్, ప్రనీత్, రఫీ, కొండల్ రెడ్డి, పాండు, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.