Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి
నవతెలంగాణ సంస్థాన్ నారాయణపురం
ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకే కాంగ్రెస్కు ఓటు వేయాలని టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి కోరారు.ధరల మీద ధరలు మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని శుక్రవారం మండలంలోని గుడిమల్కాపురం, కోతిలాపురం, అల్లం దేవి చెరువు, సర్వేలో గ్రామాల్లో నిర్వహించారు. సర్వేలు గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. బీజేపీ, టీఆర్ఎస్లకు ఓట్లు ఎందుకు వేయాలని ప్రజలుఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. ప్రజలను దోచుకుంటున్నందుకా, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినందుకా,మతోన్మాద దాడులకు పాల్పడుతున్నందుకా, ప్రజాస్తులను దోచుకుంటున్నందుకా, ప్రశ్నించే గొంతుకలపై దాడి చేస్తున్నందుకా అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి రాకముందు రూ.420 రూపాయలు ఉన్న వంట గ్యాస్ సిలిండర్ ధర బీజేపీ పాలనలో 1100లకు పెంచిందన్నారు. సర్వేలు గురుకుల పాఠశాల కట్టించినందుకు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినందుకు, నాగార్జునసాగర్ డ్యాం కట్టించినందుకు, కల్వకుర్తి నెట్టెంపాడు వంటివంద ప్రాజెక్టులు కట్టించినందుకు కాంగ్రెస్కు ఓటు వేయాలన్నారు. పాల్వాయి స్రవంతిరెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్, రాష్ట్ర మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గండ్ర సత్యనారాయణ రావు, యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, శంకర్ నాయక్,చలమల కృష్ణారెడ్డి, స్థానిక నాయకులు పల్లె రవికుమార్, పున్న కైలాస నేత, అక్బర్ అలీ, ఏపూరి సతీష్, మందుగల బాలకృష్ణ, రాస మల్ల యాదయ్య,ఈశ్వర్ రెడ్డి, ఎస్కే షబ్బీర్ అలీ, మానుపాటి సతీష్ కుమార్ పాల్గొన్నారు.