Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అకలెక్టర్ పమేలా సత్పతి
నవ తెలంగాణ -భువనగిరి రూరల్
వచ్చే జనవరి నుండి ఆయిల్ పామ్ మొక్కల పంపిణీకి క్షేత్రస్థాయిలో అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం నాడు కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ ఉద్యాన శాఖ అధికారులు , ఆయిల్ ఫెడ్ సిబ్బంది, డ్రిప్ ఇరిగేషన్ జిల్లా కోఆర్డినేటర్లతో ఆయిల్ పామ్ సాగుపై సమీక్షిస్తూ, జిల్లాకు 5800 ఎకరాల ఆయిల్ పామ్ సాగు లక్ష్యం కేటాయించినట్టు చెప్పారు. . టీఎస్ ఆయిల్ ఫేడ్ ఆయిల్ పామ్ కంపెనీ ద్వారా మొక్కల పంపిణీచేస్తున్నట్టు చెప్పారు. క్షేత్రస్థాయిలో రైతులను గుర్తించాలని, మొక్కలను, పరికరాలను అందించాలని కోరారు. 213 రూపాయల విలువ గల ఆయిల్ ఫామ్ మొక్కను సబ్సిడీపై రైతుకు రూ.20 అందిస్తున్నామన్నారు. డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 100శాతం సబ్సిడీపై, సన్న చిన్న కారు రైతులకు 90 శాతం సబ్సిడీపై, మిగతా వారికి 80శాతం సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఉద్యానవన అధికారి అన్నపూర్ణ, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, ఆయిల్ ఫెడ్ సిబ్బంది, డ్రిప్ ఇరిగేషన్ జిల్లా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
బొమ్మలరామారం : మండలంలోని చీకటి మామిడి గ్రామంలో గల రైతు వేదికలో శుక్రవారం సోలిపేట గ్రామీణ మహిళా మండలినిర్వహించిన దిశాలి రైతు మహిళా ఉత్పత్తిదారుల కంపెనీ ఐదవ వార్షికోత్సవ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ దిశాలి రైతులు పండిస్తున్న పంటలను ఒక బ్రాండ్ గా చేసుకొని మార్కెట్లో అధిక లాభాలు పొందాలని అభివృద్ధితోపాటు దిశాలి కంపెనీని కూడా అధిక లాభాల్లోకి పరుచుకోవాలని అన్నారు. మహిళలు వ్యాపారవేత్తలుగా వ్యవసాయని వ్యాపారంగా చేస్తే అధిక లాభాలు గడిస్తారని తద్వారా తమ కుటుంబాన్ని అభివృద్ధి పరచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఐఎన్ కన్సల్టెంట్ కమలమణి, నాబార్డ్ డీడీఎం వినరు కుమార్, డీఎఓ అనురాధ, ఎంపీడీవో సరిత, మహిళా మండలి అధ్యక్షురాలు విజయలక్ష్మి ,నిమ్మయ్య, ఏవో పద్మప్రియ, హరిలాల్ రైతులు తదితరులు పాల్గొన్నారు.