Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కపల్లి
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ(ఎం) ,సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం మండలకేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పన్నులు పెంచడంతోపాటు ఉపాధి కూడా లేకుండా చేసి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీటిని కార్పొరేట్ల పరం చేయడానికి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కమిటీ సభ్యులు కొక్కొండ లింగయ్య, గడ్డమీది నరసింహ,తుటి వెంకటేశం, ఆవుల కలమ్మ , సీఐటీయూ మండల నాయకులు గుండెబోయిన బలరాం, పోచయ్య ,శ్రీను కొలను శ్రీను, కోట జహంగీర్, ఆవుల పర్వతాలు, తలారి యాదగిరి ,తదితరులు పాల్గొన్నారు.