Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
మండలంలోని నందాపురం గ్రామంలో శనివారం అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేస్తున్న రైతుల పత్తిచేలను జిల్లా వ్యవసాయాధికారి రామారావునాయక్ శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది అధిక సాంద్రతపద్ధతిలో పత్తి సాగు విధానాన్ని ప్రయోగాత్మకంగా నందాపురంలో 30 ఎకరాల్లో రైతులు సాగు చేశారన్నారు.ఈ విధానంలో మొక్కల శాఖీయ దశ నియంత్రణలో ఉండడానికి మేపిక్యాట్ క్లోరైడ్ మందును లీటరునీటికి ఒక మిల్లీమీటరు చొప్పున కలిపి పిచికారీ చేయాలని సూచించారు.తద్వారా మొక్క గుబురుగా పెరగకుండా కాయ బరువు మాత్రమే పెరుగుతుందని తెలిపారు.పచ్చ దోమను నివారణకు థయోమిథక్సామ్ 0.2 గ్రా/లీ లేదా ఎసిపేట్ 1.5 గ్రా/లీ నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు.గూడ,పూత, పిందె రాలకుండా ప్లానోఫిక్స్(యస్.ఎ.ఎ.10.పి.పి) ద్రావణాన్ని ఐదు లీటర్ల నీటికి ఒక మిల్లీ లీటరు చొప్పున కలిపి 10-15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలన్నారు.అనంతరం కామన్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్నిధి పథకానికి సంబంధించి ఈకేవైసీ చేసుకునే విధానాన్ని పరిశీలించారు.ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్నిధి పథకానికి సంబంధించి ఇంకా ఈకేవైసీ చేసుకోని రైతులు ఈనెల 30 వ తేదీ వరకు చేయించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు వెంకట్రెడ్డి, శ్రీను, కామన్ సర్వీస్ సెంటర్ ఇన్చార్జి బాలాజీ, రైతులు జక్కుల లింగయ్య,కన్నెబోయినలక్ష్మయ్య,వెంకన్న ,కిష్టయ్య, పర్రేపాటి మల్లయ్య పాల్గొన్నారు.