Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర అధ్యక్షులు మాటూరి బాలరాజ్ గౌడ్
నవతెలంగాణ- వలిగొండ
నేఉ వలిగొండ మండలకేంద్రంలోని సాయి గణేశ్ ఫంక్షన్ హాల్లో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా మూడవ మహాసభలను నిర్వహించనున్నట్టు ఆసంఘం రాష్ట్ర అధ్యక్షులు మాటూరి బాలరాజు గౌడ్ కోరారు. శనివారం స్థానికంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ
గీతా కార్మికుల పెన్షన్లు ,ఎక్గ్రేషియాలు చెల్లించాలని, లైసెన్స్ రెన్యువల్ కాలపరిమితి 10 ఏండ్లకు పొడిగించేలా ప్రభుత్వంపై అనేక పోరాటాలు నిర్వహించామని తెలిపారు. జిల్లా మహాసభలో రాబోయే మూడు సంవత్సరాల కాలానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకునేందుకు జిల్లా మహాసభల్లో చర్చించి భవిష్యత్తు ప్రణాళిక రూపొందిస్తామన్నారు. కల్లుగీత కార్మికుల పెన్షన్లను ఐదు వేల రూపాయలకు పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, తాటి చెట్ల పైనుండి పడి మరణించిన గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా 10 లక్షల రూపాయలకు పెంచి నెలలోపుగా అందించాలని, మెడికల్ బోర్డు నిబంధన ఎత్తేయాలని, గౌడ కల్లుగీత యువతి యువకులకు నీరా, తాటి అనుబంధ ఉత్పత్తుల ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్లో గీతా కార్మిక సంక్షేమానికి 5000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి గీత కార్మికుల అభివద్ధికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు . ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మద్దెల రాజయ్య ,మండల అధ్యక్షులు పబ్బతి మల్లేశం, మండల ప్రధాన కార్యదర్శి, గాజుల ఆంజనేయులు, మండల కోశాధికారి పలుసం స్వామి, తదితరులు పాల్గొన్నారు.