Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
గ్రామాల శివారులలో వ్యవసాయ పొలాల వద్ద, ఒంటరిగా ఉన్న మహిళల పై దాడులు చేస్తూ దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు దేవరకొండ డీఎస్పీ ఎం. నాగేశ్వరరావు అన్నారు. శనివారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీఏ పల్లి మండలం గుడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సింగరాజుపల్లి గ్రామానికి చెందిన, నాయిని వెంకటమ్మ జులై 10వ తేదీన గ్రామ శివారులోని వ్యవసాయ పొలం వద్దకు తన భర్త వెంకటేశ్వర రెడ్డికి నడుచుకుంటూ భోజనం తీసుకు వెళుతుండగా గణపురం దారిలో గుర్తుతెలియని వ్యక్తి మోటార్ సైకిల్ పై వచ్చి బలవంతంగా మెడలో రెండు వరసలో సుమారు మూడు తులాల బంగారు తాడును దొంగలించుకుని పోయాడని గుడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. నిందితుని గురించి విచారిస్తుండగా శనివారం ఉదయం భీమనపల్లి గ్రామ శివారులో గన్ పల్లి క్రాస్ రోడ్ వద్ద పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు పెద్దవూర మండలం మల్లెవానికుంట తండా చెందిన రమావత్ రాంబాబు ద్విచక్ర వాహనపై అనుమానస్పదంగా వెళుతుండగా పోలీసులు పట్టుకొని విచారించగా, గత రెండు నెలల కాలంలో రాంబాబు చేసిన దొంగతనాల గురించి వివరించినట్లు డిఎస్పి తెలిపారు. ఈ కేసును త్వరితగతిన శ్రమించి ఛేదించిన కొండమల్లేపల్లి సిఐ రవీందర్, గుడిపల్లి ఎస్సై వీరబాబుతో పాటు గురువారెడ్డి, పాపిరెడ్డి, లాలూనాయక్, ఏడుకొండలు, ఐడి పార్టీ హేమ నాయకును డీఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో సీఐ రవీందర్, ఎస్సై వీరబాబు తదితరులు పాల్గొన్నారు.