Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
బీజేపీ ప్రభుత్వం అనుసరి స్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని మెయిన్ సెంటర్లో సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిత్యవసర ధరలు విపరీతంగా పెంచడం వల్ల ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు . దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ రంగ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఇప్పటికే 80 శాతం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ రంగ సంస్థలకు అమ్మి వేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ కార్యదర్శి వంటేపాక వెంకటేశ్వర్లు, నాయకులు యానాల కృష్ణారెడ్డి, చిన్నబోయిన నాగమణి, బొజ్జ చిన్న వెంకులు, ఒంటెపాక కృష్ణ, సిహెచ్ లూర్దు మారయ్య, బాలస్వామి, సోమయ్య, లక్ష్మీ, అంజయ్య, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.