Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితుల ఆర్థికాభివృద్ధి కోసం రూపొందించిన దళిత బంధు కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ టి.వినరు కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎంపీడీవోలు, నియోజక వర్గ ప్రత్యేక అధికారులు, వ్యవసాయ, పరిశ్రమల, పశు సంవర్థక, రవాణా శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ దళిత బంధు పథకం కింద మంజూరైన యూనిట్ల గ్రౌండింగ్ పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆరు నియోజక వర్గాల్లో,తుంగతుర్తి నియోజక వర్గంలోని శాలి గౌరారం మండలంకు సంబంధించి 517 మంది లబ్ధిదారులను ఎంపిక పూర్తి చేసి రూ.10 లక్షలలకు గాను ఒక్కొక్క లబ్ధి దారుని బ్యాంక్ ఖాతాలలో 9 లక్షల 90 వేలలు జమ చేసినట్లు తెలిపారు. 10 వేల రూ.లు రక్షిత నీది కింద జమ చేయడం జరిగిందని, ప్రభుత్వం రూ. 10 వెలు మ్యాచింగ్‌గా అందజేస్తుందని అన్నారు. జిల్లాలో 517 మంది లబ్ది దారులకు యూనిట్లు పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. 17 మండలంలలో 20 గ్రామాలకు సంబందించి యూనిట్లు గ్రౌండింగ్,పెండింగ్ యూనిట్ల పై ఎం.పి.డి. ఓ.లను జిల్లా కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకుని సూచనలు చేశారు. ఉద్యానవన శాఖ నిబంధనల మేరకు దళిత బంధువులను గ్రౌండింగ్ చేయాలని సూచించారు. డైరీ ఫార్మ్స్ నెలకొల్పేందుకు లబ్ధిదారులు సూచించాలని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను కూడా నెలకొల్పుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో డీఆర్డీవో కాళిందిని, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశం, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు గోపిరాం, రాజ్ కుమార్, రాజేందర్ రెడ్డి, ట్రాన్స్పోర్ట్ అధికారి సురేష్‌రెడ్డి, ఉద్యానవనశాఖ అధికారిని సంగీత లక్ష్మి, వ్యవసాయ శాఖ అధికారి సుచరిత,పరిశ్రమల శాఖ జి.యం. కోటేశ్వర్ రావు, పశు వైద్య శాఖ అధికారి డా.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.