Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదిత్య పాఠశాలలో బతుకమ్మ సంబరాలు
నవతెలంగాణ-మిర్యాలగూడ
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ సంబరాలను స్థానిక మిర్యాలగూడ పట్టణంలోని ఆదిత్య పాఠశాలలో శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మారుతీ అమరేందర్‌రెడ్డి భరతమాత, తెలంగాణ తల్లి చిత్రపటాలకు పూలమాల అలంకరించి, జ్యోతిప్రజ్వలన చేసి సంబరాలను ప్రారంభించారు. ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొని బతుకమ్మ అంటే ఏమిటీ, బతుకమ్మ కథలు, బతుకమ్మను ఎలా పేరుస్తారు వంటి విషయాలు బతుకమ్మ ను పేర్చూతూ విద్యార్దిని, విద్యార్థులతో కూడా రంగు రంగుల పూలతో అందమైన బతుకమ్మలని పెర్పించి అర్దం అయ్యేలా వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిర్యాలగూడ ఎంపీడీవో జ్యోతి లక్ష్మి హాజరై మాట్లాడారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం సమయంలో తల్లి దండ్రులకు బతుకమ్మ పోటీలు, మంచి వస్త్ర ధారణ వంటివి నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో వీరారెడ్డి, పాఠశాల కరస్పాండెంట్ మారుతీ అమరేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ బంటు నాగరాజు, వైస్ ప్రిన్సిపాల్ కట్టా అనిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
శిష్య పాఠశాలలో ఘనంగా దేవి నవరాత్రులు, బతుకమ్మ సంబురాలు..
పట్టణంలోని శిష్య పాఠశాలలో శనివారం దేవీ నవరాత్రులు, బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. దేవి నవరాత్రులలో భాగంగా అమ్మవారి వేషధారణలో పాఠశాల విద్యార్ధినీలు ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మెన్ శ్రీనివాస్‌రెడ్డి, కరస్పాండెంట్ శిరీషలు మాట్లాడుతూ అమ్మవారి పాత్రలు ధరించిన విద్యార్థినిలను అభినందించారు. పాఠశాలలో అన్ని మతాల పండుగలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురుని అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
లిటిల్ ఫ్లవర్ ప్రాంగణంలో..
పట్టణంలోని హౌసింగ్ బోర్డులోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ ఆవరణలో శనివారం దసరా పండుగను పురస్కరించుకొని బతుకమ్మ సంబరాలను ఘనంగా జరిపారు. హై స్కూల్ బాలికలు వివిధ రకాల పూలతో పెద్ద పెద్ద బతుకమ్మలను పేరిచి, వివిధ రంగు రంగుల దుస్తులతో, అలంకరణలతో స్కూల్ ఆవరణలో పేర్చి, విద్యార్థినులు బతుకమ్మ ఆడుతూ ఘనంగా సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ కె.కె. జయరాజన్ ఝాన్సీ మాట్లాడారు.
సెయింట్ జాన్స్ స్కూల్లో..
సెయింట్ జాన్స్ స్కూల్లో శనివారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. హై స్కూల్ విద్యార్థినిలు ప్రత్యేక వేషాదనలతో అలరించారు. వివిధ రంగుల పూలను పేర్చి బతుకమ్మ ఆట ఆడారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ అలుగుబెల్లి శ్రీనివాసరెడ్డి కరస్పాండెంట్ అలుగుబెల్లి శిరీష మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ కలెక్టరేట్ : స్థానిక ఎన్జీ కళాశాలలో మహిళా సాధికారికత విభాగం, జాతీయ సేవా పథకం యూనిట్ల ఆధ్వర్యంలో శనివారం బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గణ శ్యామ్, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ దీపిక, మహిళా అధ్యాపకులు భాగ్యలక్ష్మి, మన్నెమ్మ, వాణి, మహిళ సిబ్బంది, వేణు, వెంకట్ రెడ్డి, యాదగిరిరెడ్డి, విద్యార్థినులు, పాల్గొన్నారు.
చండూరు : స్థానిక సన్ షైన్ పాఠశాలలో శనివారం ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కలిసి బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులందరూ వివిధ రకాల పూలను సేకరించి ఉపాధ్యాయులతో కలిసి బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ కోడి వెంకన్న మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కోడి సుష్మ, ప్రిన్సిపల్ రవికాంత్, లతీఫ్ పాష, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నార్కట్‌పల్లి : మండల పరిధిలోని ఎల్లారెడ్డిగూడెంలోని శ్రీకష్ణవేణి హై స్కూల్లో బతుకమ్మ సంబరాలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మట్ట చెన్నయ్యగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి నిదర్శనం బతుకమ్మ అన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు రంగురంగుల పూలతో అలంకరించి ఆకర్షణీయంగా బతుకమ్మలను తయారు చేశారు. విద్యార్థులు బతుకమ్మ విశిష్టతను తెలుసుకొని తీరొక్క పువ్వులతో బతుకమ్మలు పేర్చి ఆటపాటలతో ఎంతో ఘనంగా బతుకమ్మ సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మెన్ మట్ట సబిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
నకిరేకల్ : తెలంగాణ అస్తిత్వానికి నిలువుటద్దం బతుకమ్మ పండుగ అని నకిరేకల్ మున్సిపల్ వైస్ చైర్మెన్ మురారిశెట్టి ఉమారాణి కృష్ణమూర్తి పేర్కొన్నారు. శనివారం తెలంగాణ బతుకమ్మ ఉత్సవాలను నకిరేకల్ పట్టణంలోని శాస్త్ర పాఠశాలలో, మండలంలోని పాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి అందంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వంటల వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు టి.నర్సింహమూర్తి, సిహెచ్. నర్సయ్య, యాదమ్మ, సుష్మ, శాస్త్ర పాఠశాల డైరెక్టర్ సరిత రెడ్డి, అడ్మినిస్ట్రేటర్ నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ వేణుగోపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.