Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతపల్లి
విద్యతోనే సామాజిక మార్పు వస్తుందని నల్లగొండ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మెన్ చింతపల్లి జడ్పీటీసీ కంకణాల ప్రవీణ వెంకట్ రెడ్డి అన్నారు. శనివారం చింతపల్లి మండలం గొడుకొండ్ల వెంకటేశ్వరనగర్, కుర్మేడు గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బతుకమ్మ పండుగను పురస్కరించుకొని నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ పండుగ కీర్తిని చాటాలని ఆమె అన్నారు. విద్యార్థులు విద్యతోపాటు సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థి దశ నుంచే అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొండూరు భవాని పవన్, ఎంపీటీసీ కుంభం శ్వేత శ్రీశైలంగౌడ్, సర్పంచ్ రాటకొండ రుద్రమదేవి నరేంద్ర ప్రసాద్, విద్యా కమిటీ చైర్మెన్లు కొడిదూటి జంగయ్య, గౌస్య, ప్రదానోపాధ్యాయులు కూరేళ్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.