Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరి రూరల్
తెలంగాణ రాష్ట్రం నిర్వహించిన స్టేట్ కౌన్సిల్ ఎడ్యుకేషనల్ రీసర్చ్ ట్రైనింగ్ కార్యక్రమంలో భాగంగా బేసిక్ సైన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సైన్స్ సెమినార్లో జిల్లాకు చెందిన బ్రిలియంట్ స్కూల్ కు చెందిన కావ్యకు రాష్ట్రస్థాయిలో ప్రశంసా పత్రం వచ్చినట్లు ప్రిన్సిపాల్ నక్క కృష్ణయ్య తెలిపారు. శనివారం విద్యార్థినిని అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈ సెమినార్లో 29 జిల్లాల నుంచి విద్యార్థులు పాల్గొన్నట్టు తెలిపారు. పేదరిక నిర్మూలన, ఆకలి దారిద్రం నిరుద్యోగం నిరక్షరాస్యత ,వాతావరణ కాలుష్యం, సహజ వనరుల నాశనం అనే అంశంపై మాట్లాడిన కావ్యను ఉత్తమ విద్యార్థినిగా ఎంపిక చేసినట్లు తెలిపారు. విద్యార్థినిని ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం సంజయ్, మాధవి, రాణి, రాజు, అమిద్ , ఉదరు, ముంతాజ్ బేగం, శ్రీశైలం అభినందించారు.