Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
మిర్యాలగూడ పట్టణంలో డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఐద్వా సంఘాల ఆధ్వర్యంలో శనివారం బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవినాయక్, ఆవాజ్ జిల్లా అధ్యక్షులు ఎండి. అంజద్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు వరలక్ష్మి, ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి సైదానాయక్లు మాట్లాడుతూ ఆడపిల్లను పుట్టనిద్దాం.. బ్రతకనిద్దాం.. ఎదగనిద్దాం, చదవనిద్దాం.. అనే నినాదన్నీ ప్రజల్లోకి తీసుకెళుతున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై అత్యాచారాలు ఎక్కువయ్యాయని, వాటిని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రపంచంలో అన్ని పండుగలు, అన్ని జాతర్లలో పూలతో దేవుళ్లను పూజిస్తారని కానీ పూలనే పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ ప్రాంతంలో ఉందని, అటువంటి సంస్కృతిని కుల మతాలకతీతంగా కాపాడు కోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం సీనియర్ నాయకురాలు గాదె పద్మమ్మ, వేములపల్లి వైఎస్ ఎంపిపి పాధురి గోవర్ధన, ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు శీను నాయక్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు వధుద్, జగన్నాయక్, ఎస్ఎఫ్ఐ నాయకులు వీరన్న, ఆకాష్ సూర్య, మంగతా, తరుణ్, ముని, జ్యోతి, షకుంతల, రజని, సుజాత, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.