Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
అర్హులైన గొర్రెలు, మేకల పెంపకందార్లందరికీ డబుల్బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని కోరుతూ జీఎంపీఎస్ వెలిశాల సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్ ఆకుల వీరయ్యకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య మాట్లాడుతూ 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్క యాదవులకు రూ.5 లక్షల నగదుబదిలీ చేయాలని కోరారు.ఖాళీగా ఉన్న వెటర్నరీ పోస్టులు యాదవ విద్యార్థులకు ఇవ్వాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు యాదవులకు వర్తించే విధంగా చూడాలన్నారు.యాదవ విద్యార్థులు చదువుకోవడానికి ప్రత్యేక హాస్టల్లో కాలేజీలు ఏర్పాటు చేయాలని, ప్రతి గ్రామంలో సొసైటీ ఎన్నికలు జరపాలి కోరారు.వినతిపత్రం అందజేసిన వారిలో మండల కార్యదర్శి కడారి లింగయ్య, యాకయ్య, మధు, మల్లేష్, సంపత్, పరమేష్ ఉన్నారు.