Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాంపల్లి
మండలంలోని పసునూర్ గ్రామ పంచాయితికి చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మెండే సత్తయ్య, బేగు వెంకటయ్యలు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండడంతో శనివారం పసునూర్ మాజీ సర్పంచ్ పోగుల వెంకట్రెడ్డి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి ద్వార ఈ విషయం తెలుసుకున్న మునుగోడు మాజీ శాసనసభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వారి కుటుంబాలకు 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం పంపించినట్టు తెలిపారు. బాధిత కుటుంబాలకు చెరో 10 వేల చొప్పున అందజేసినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల్ కో ఆప్షన్ సభ్యులు ఎస్ కె. అబ్బాస్, గ్రామశాఖ అధ్యక్షుడు జింకల నరేష్, వార్డు సభ్యులు, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.