Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూదాన్‌పోచంపల్లి
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతిక అని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు.ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో అధ్యక్షతన బతుకమ్మ చీరలను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు.తెలంగాణ ఏర్పడిన నాటినుండి బతుకమ్మ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు సైతం గుర్తించి కీర్తిస్తున్నాయన్నారు నేతన్నలకు ప్రభుత్వం చేయూతనందించి ఆదుకుంటుందన్నారు .అనంతరం మెహర్‌నగర్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నుండి 20 మంది యువకులు గ్రామ శాఖ అధ్యక్షులు రాసునూరి లింగస్వామి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.చేరిన వారిలో ఏర్పులవంశీ,బూరుగు వంశీ, సిద్ధగోని వెంకటేష్, చెక్క వినరు , ఆకుల శివప్రసాద్, మూటపురంరాకేష్, యంజాల సతీష్, చెక్క రామ్, ఆకులనాని, రాసనూరి మల్లేష్ ఏర్పుల నాని,ఏర్పుల సిద్ధు, చెక్క జంగయ్య, చెక్కమధు, కళ్లెం శరత్, సిద్ధగోని నవీన్ ఉన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాడుగుల ప్రభాకర్‌రెడ్డి,జెడ్పీటీసీ కోటపుష్పలత మల్లారెడ్డి, వైస్‌ఎంపీపీ పాకవెంకటేశంయాదవ్, పీఏసీఎస్ చైర్మెన్ భూపాల్‌రెడ్డి, రావుల శేఖర్‌రెడ్డి, పార్టీ అధ్యక్ష కార్యదర్శులు పాటి సుధాకర్‌రెడ్డి, చిలువేరు బాలనర్సింహ, ప్రజాపతి బంగారపు లక్ష్మణ్‌గౌడ్, రాజశేఖర్‌రెడ్డి, సర్పంచ్ స్వాతి వెంకటేశం,ఉపసర్పంచ్ రామచంద్రం, రేవెల్లి శ్రీనివాస్, ఆకుల రవి, సిర్పంగి మహేష్, రాసనూరి నర్సింహ, సిల్వేరు శివ, రాసనూరి పరమేశ్,యంజాల కృష్ణ, కుక్క కుమార్ పాల్గొన్నారు.
అర్వపల్లి:బతుకమ్మ చీరలు ఆడపడుచులకు సారెవంటిదని ఎంపీపీ మన్నెరేణుకా లక్ష్మీనర్సయ్య యాదవ్ అన్నారు.మండలపరిధిలోని కుంచమర్తి గ్రామంలో ఆదివారం బతుకమ్మ చీరను వారు పంపిణీ చేసి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉపేంద్ర లింగరాజు, టీఆర్ఎస్ నాయకులు మన్నె లక్ష్మీనర్సయ్య, ఉగ లింగరాజుయాదవ్ పాల్గొన్నారు.అదేవిధంగా మండలకేంద్రంలో మహిళలకు జెడ్పీటీ దావుల వీరప్రసాద్‌యాదవ్ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బైరబోయిన సునీతరామలింగయ్య,దేవాలయచైర్మెన్ చిల్లంచర్ల విద్యాసాగర్, ఉపసర్పంచ్ పులిచర్ల ప్రభాకర్, వార్డు సభ్యులు కడారి పద్మయోగానందం, భద్రబోయిన జ్యోతిశ్రీనివాస్, ఆవుల భారతమ్మ, జిల్లా కిరణ్‌కుమార్, టీఆర్ఎస్ నాయకులు బైరబోయిన పెద్దులు, దావుల లింగయ్య, మామిడి శ్రీనివాస్, జోర్కచంద్రయ్య పాల్గొన్నారు.
అదేవిధంగా మండలంలోని తిమ్మాపురం గ్రామంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ మారిపెద్ది భవానిశ్రీనివాస్గౌడ్, సర్పంచ్ పాలెల్లి సురేష్,వార్డుసభ్యులు దేశిడి సందీప్‌రెడ్డి, బొల్లం ప్రభాకర్, పాఠశాల చైర్మెన్లు తండ లింగమూర్తిగౌడ్,బూర్గులరాంబాబు, గ్రామ శాఖ అధ్యక్షులు కందుల దశరథ రామరావు పాల్గొన్నారు.మండలంలోని కొమ్మాల గ్రామంలో పీఏసీఎస్ చైర్మెన్ కుంట్ల సురేందర్‌రెడ్డి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.అనంతరం గ్రామానికి చెందిన వెంకన్నకు మంజూరైనసీఎంఆర్ఎఫ్ చెక్కు రూ.56 వేలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కుంట్ల రేణుకగోవర్థన్రెడ్డి, గ్రామఅధ్యక్షులు కుక్కడపు సైదులు, మండలయూత్ అధ్యక్షుడు కుంట్ల శ్రీనివాస్‌రెడ్డి, గ్రామ కార్యదర్శి నారాయణమూర్తి, వార్డుసభ్యులు పాల్గొన్నారు.
భువనగిరిరూరల్:మండలంలోని బస్వాపురం గ్రామంలో తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరలను భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఆదివారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పూల పండుగ,తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ అన్నారు.ప్రతి ఏడాది ప్రభుత్వం ఆడపడుచులకు చీరలను సారెలుగా అందిస్తుందన్నారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అనంతరం బతుకమ్మకు ప్రపంచ వ్యాప్తంగా మరింత గుర్తింపు వచ్చిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్, జెడ్పిటిసి సుబ్బురు బీరు మల్లయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ అమరేందర్ గౌడ్, జిల్లా రైతుబంధు సమితి మండలకోఆర్డినేటర్ కొలుపుల అమరేందర్, మార్కెట్ కమిటీ చైర్మెన్ ఎడ్ల రాజేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలఅధ్యక్షులు జనగాం పాండు,మండల రైతుబంధు సమితి కోఆర్డినేటర్ కంచి మల్లయ్య,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నీల ఓంప్రకాశ్ గౌడ్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొండంస్వామి,అబ్బగాని వెంకట్‌గౌడ్,కస్తూరి పాండు,జడల యశీల్గౌడ్, రాసాల శ్రీశైలం,సర్పంచులు లు కస్తూరి మంజుల శ్రీశైలం,చిందం మల్లికార్జున్,అంకర్ల మురళి కృష్ణ,మాకోలు సత్తయ్య,ఉపసర్పంచ్ మచ్చ కరుణతిరుపతి, మండల మహిళా అధ్యక్షురాలు దుర్గపతి చంద్రమ్మ,గ్రామ శాఖ అధ్యక్షులు ర్యాకలశ్రీనివాస్,ఉడుత రామచంద్రయ్య,పాశం మహేశ్ పాల్గొన్నారు.
ఆలేరుటౌన్ : తొమ్మిది రోజుల పాటు మహిళలు వివిధ రకాల పూలను పేర్చి , గౌరమ్మను నెలకొల్పి , పూజించే బతుకమ్మ పండుగ వేడుకలు మండలకేంద్రంలో ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మ తో అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి పట్టణంలోని పలు కాలనీలలో మహిళలు గునుగు , తంగేడు ,బంతి, చామంతి ,మందార ,సన్నజాజి పూలు, నందివర్ధనపూలతో పాటు అందుబాటులో ఉన్న ఇతర పూలను సేకరించి బతుకమ్మలను వివిధ ఆకారాల్లో, ఆకృతులలో మహిళలు అందంగా ముస్తాబు చేసి,వివిధ రకాల హంగలు పూలకు రంగులు అద్ది , మెరుపులతో తీర్చిదిద్దారు . మహిళలు బతుకమ్మలను ముందుగా వారి వారి ఇళ్లవద్ద జాజుతో అలీకి బతుకమ్మను ప్రతిష్ఠించి అగరువత్తులు వెలిగించి ఇండ్లు ముందు వాడడం జరిగింది అనంతరం .పట్టణంలోని పలు వార్డుల్లో ,పట్టణ పరిధిలోని బహుదూర్పేట, సాయిగూడెం ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను ఒకచోటకు చేర్చి మహిళలు సామూహికంగా ఆడిపాడారు. చిన్నారులు ,యువకులు బాణాసంచా పేల్చుతూ కేరింతలు కొట్టారు.పట్టణమంతా బతుకమ్మ పండుగ వేడుకల తో కోలాహలంగా మారింది.బతుకమ్మల వద్ద అనంతరం పట్టణంలోని శ్రీ కనకదుర్గ ఆలయం వద్ద ఆలేరు పెద్దవాగులో,బహుదూర్పేట వద్ద, రత్నాలవాగు వద్ద, సాయిగూడెంవద్ద పెద్దవాగులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు..
అదేవిధంగా ఏక శిలా విద్యాలయంలో ఉపాధ్యాయులు విద్యార్థులు నూతనవస్త్రాలు ధరించి ,రంగు రంగుల తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఉయ్యాల పాటలు పాడుతూ, బతుకమ్మ పూలను కొలిచారు.అనంతరం అందంగా ముస్తాబు చేసిన బతుకమ్మలకు బహుమతులను యాజమాన్యం అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఇందిర,సాయికిరణ్‌రెడ్డి, వంశీ, ఉపాధ్యాయులు, పురప్రముఖులు పాల్గొన్నారు.
పట్టణంలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు .
మోత్కూరు:తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం కోసమే ప్రభుత్వం బతుకమ్మ చీరెలు పంపిణీ చేస్తుందని ఎంపీపీ రచ్చ కల్పనలక్ష్మీ నర్సింహారెడ్డి అన్నారు మండలంలోని దాచారం, పాటిమట్ల గ్రామాల్లో ఆదివారం మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు.మండలంలోని పాలడుగు గ్రామంలో సర్పంచ్ మరిపెల్లి యాదయ్య, ఎంపీటీసీ ఆకవరం లక్ష్మణాచారి మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో దాచారం, పాటిమట్ల సర్పంచులు అండెం రజితరాజిరెడ్డి, దండెబోయిన మల్లేష్, పాలడుగు ఉపసర్పంచ్ ఎడ్ల భగవంతు, రైతుబంధు గ్రామకోఆర్డినేటర్ సింగిరెడ్డి నర్సింహారెడ్డి, ఎస్ఎంసీ చైర్మెన్ ఎం.మల్లేష్, కె.అంజయ్య, బి.వీరయ్య, ఎం.మత్స్యగిరి తదితరులు పాల్గొన్నారు.