Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరురూరల్
ఉపాధిహామీ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వర్యం చేయడానికి చూస్తుందని, కేంద్రంలో పోరాడేందుకు వ్యవసాయ కార్మికులు సిద్ధం కావాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జూకంటి పౌలు,మండల ఉపాధ్యక్షులు బొమ్మకంటి లక్ష్మీనారాయణ అన్నారు.ఆదివారం మండలంలో గుండ్లగూడెం గ్రామంలో సమావేశం వ్యవసాయకార్మిక సంఘం చక్కిళ్ల ఉపేంద్ర అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.బీజేపీ ప్రభుత్వం వేసవి అలవెన్స్ రద్దు చేస్తూ సర్క్యులర్ 170 22 31 జారీ చేసి ఉపాధిపనులను హాజరు నమోదు కోసం నేషనల్ మొబైల్ మానిటరింగ్ సంస్థ ఎన్ఎంఎంఎన్ తెచ్చి ఉపాధికూలీలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు.ఎన్నో పోరాటాల ఫలితంగా వచ్చిన ఉపాధి చట్టాన్ని మోడీ ప్రభుత్వ రద్దు చేయడానికి అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తుందని విమర్శించారు.మూడు నెలలుగా నుండి పనిచేసిన వారికి ప్లే షిఫ్ట్ ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు.పెండింగ్‌లో ఉన్న డబ్బులను వెంటనే చెల్లించాలని కోరారు.ఈ సమావేశంలో సోమలక్ష్మీ, గిరిజ, పాపమ్మ, రమణమ్మ, నర్సింగరావు, శ్రీరాములు, చంద్రయ్య, శ్రీనివాస్, భిక్షపతి,సదానందం, ప్రదీప్‌రెడ్డి పాల్గొన్నారు.