Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తుందని,మునుగోడు ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోవడం ఖాయమని సీపీఐ(ఎం) జిల్లాకమిటీ సభ్యులు ఎమ్‌డి.పాషా, మున్సిపల్ కార్యదర్శి బండారు నర్సింహ విమర్శించారు. ఆదివారం పట్టణకేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారకభవనంలో గోశిక స్వామి అధ్యక్షతన పార్టీ మున్సిపాలిటీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయడంలో విఫలం చెందిందన్నారు.బీజేపీ పాలనలో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోయిందన్నారు.ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి తగ్గి దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందన్నారు. బడా పెట్టుబడిదారులకు 11 లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు రద్దుచేసిందన్నారు. మరో రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులకు రాయితీలు ఇచ్చారన్నారు.ప్రజా సమస్యలు పట్టించుకోకుండా బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముకాస్తుందన్నారు. మునుగోడు నియోజకవర్గంలో రానున్న శాసనసభ ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్‌చైర్మెన్ బత్తుల శ్రీశైలం, పార్టీ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ గోపగోని లక్ష్మణ్, కౌన్సిలర్ దండ హిమబిందుఅరుణ్కుమార్, నాయకులు ఆకుల ధర్మయ్య, గోశిక కర్నాకర్, బత్తుల విప్లవ్‌కుమార్, ఉష్కాగుల శ్రీనివాస్, రమేశ్, గుర్రంనర్సింహ, ఎమ్‌డి.ఖయ్యుమ్, చీకూరి ఈదయ్య, బొమ్మకంటి కృష్ణ, సప్పిడి శ్రీనివాస్‌రెడ్డి, గంజి రామచంద్రం పాల్గొన్నారు.